Share News

రియల్టీలోకి జీఎంఆర్‌ గ్రూపు

ABN , Publish Date - Oct 15 , 2026 | 06:15 AM

జీఎంఆర్‌ గ్రూపు రియల్టీ రంగంలోకి ప్రవేస్తోంది. ఇందుకోసం జీఎంఆర్‌ ఏరో రియల్టీ లిమిటెడ్‌ (జీఏఆర్‌ఎల్‌) పేరుతో ప్రత్యేక అనుబంధ కంపెనీని...

రియల్టీలోకి జీఎంఆర్‌ గ్రూపు

న్యూఢిల్లీ: జీఎంఆర్‌ గ్రూపు రియల్టీ రంగంలోకి ప్రవేస్తోంది. ఇందుకోసం జీఎంఆర్‌ ఏరో రియల్టీ లిమిటెడ్‌ (జీఏఆర్‌ఎల్‌) పేరుతో ప్రత్యేక అనుబంధ కంపెనీని ఏర్పాటు చేసినట్టు జీఎంఆర్‌ గ్రూపు ప్రధాన కంపెనీ జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ లిమిటెడ్‌ తెలిపింది. రూ.కోటి ప్రారంభ మూలధనంతో ఏర్పాటు చేసిన జీఏఆర్‌ఎల్‌.. రియల్‌ ఎస్టేట్‌, ల్యాండ్‌ డెవల్‌పమెంట్‌, సంబంధిత ఇతర రంగాల్లో వ్యాపార అవకాశాలను పరిశీలిస్తుందని పేర్కొంది. ఈ నెల 13న ఈ అనుబంధ కంపెనీని నమోదు చేసినట్టు జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ రెగ్యులేటరీ సంస్థలకు తెలిపింది. జీఏఆర్‌ఎల్‌ ఇంకా వ్యాపార కార్యక్రమాలను ప్రారంభించాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి:

తన పని తాను చేశాడు.. ఫలితం వెతుక్కుంటూ వచ్చింది: అశ్విన్

ప్రయాణాన్ని కొత్తగా ప్రారంభిస్తున్నాం.. మళ్లీ ఒక్కటైన క్రికెటర్ పృథ్వీ షా-ఆకృతి

పోలీసుల దాడుల్లో ఓ విద్యార్థిని వినికిడి శక్తి కోల్పోయింది.. దీనికి బాధ్యులెవరు? : రాహుల్ గాంధీ

Updated Date - Oct 15 , 2026 | 06:15 AM