జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ లాభం రూ.65 కోట్లు
ABN , Publish Date - Oct 30 , 2026 | 05:55 AM
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికానికి జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ లిమిటెడ్ (జీఏఎల్) రూ.65 కోట్ల...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికానికి జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ లిమిటెడ్ (జీఏఎల్) రూ.65 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. ఏరో, నాన్-ఏరో విభాగాల నుంచి వచ్చిన అధిక ఆదాయాలు ఇందుకు దోహదపడ్డాయి. గత ఏడాది ఇదేకాలంలో కంపెనీ ఆర్జించిన నికర లాభం రూ.35 కోట్లతో పోల్చితే వృద్ధి 86 శాతంగా ఉంది. సమీక్షా త్రైమాసికంలో మొత్తం ఆదాయం 12 శాతం పెరిగి రూ.3,754 కోట్ల నుంచి రూ.4,188 కోట్లకు చేరుకుంది. సెప్టెంబరు త్రైమాసికంలో జీఎంఆర్ నిర్వహణలోని విమానాశ్రయాల ద్వారా 2.8 కోట్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు.
ఇవి కూడా చదవండి:
డబ్ల్యూపీఎల్ వేలంలో అన్‌సోల్డ్.. మైదానంలో రికార్డుల మోత..
28 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. ఇకపై ఐటీ రంగంలో కొత్త బాధ్యతలు
ముంబై ఇండియన్స్ కీలక నిర్ణయం.. ముగ్గురు కోచ్‌లకు వీడ్కోలు