Share News

జీఎంఆర్‌ ఏరో టెక్నిక్‌, బోయింగ్‌ డిఫెన్స్‌ జట్టు

ABN , Publish Date - May 15 , 2026 | 05:22 AM

విమానాల నిర్వహణ, రిపేర్‌, ఓవర్‌హాల్‌ (ఎంఆర్‌ఓ) సేవలందిస్తున్న జీఎంఆర్‌ ఏరో టెక్నిక్‌.. బోయింగ్‌ డిఫెన్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ (బీడీఐపీఎల్‌)తో...

జీఎంఆర్‌ ఏరో టెక్నిక్‌, బోయింగ్‌ డిఫెన్స్‌ జట్టు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): విమానాల నిర్వహణ, రిపేర్‌, ఓవర్‌హాల్‌ (ఎంఆర్‌ఓ) సేవలందిస్తున్న జీఎంఆర్‌ ఏరో టెక్నిక్‌.. బోయింగ్‌ డిఫెన్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ (బీడీఐపీఎల్‌)తో ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందంలో భాగంగా బోయింగ్‌కు చెందిన పీ8ఐ మారిటైమ్‌ పెట్రోల్‌ ఎయిర్‌క్రాఫ్ట్స్‌ కోసం ఫేజ్‌56 హెవీ మెయుంటెనెన్స్‌ పరీక్షలను జీఎంఆర్‌ ఏరో చేపట్టనుంది. హైదరాబాద్‌, జీఎంఆర్‌ ఏరోస్పేస్‌ పార్క్‌ సెజ్‌లోని ఎంఆర్‌ఓ ఫెసిలిటీలో ఈ విమానాల నిర్వహణ, మెయింటెనెన్స్‌ను చేపట్టనున్నట్లు తెలిపింది. బోయింగ్‌ మెయింటెనెన్స్‌ ప్రమాణాలకు అనుగుణంగా ఈ విమానాలకు సమగ్ర పరీక్షలు, పెయింటింగ్‌, స్ట్రక్చరల్‌, సిస్టమ్స్‌ అప్‌గ్రేడ్స్‌ను జీఎంఆర్‌ చేపట్టనుంది. ప్రస్తుతం భారత నౌకా దళం.. తమిళనాడులోని ఐఎన్‌స్ఎస్ రాజాలి, గోవాలోని ఐఎన్‌స్ఎస్ హంసలో 12 పీ8ఐ విమానాలను ఉపయోగిస్తోంది.

ఈ వార్తలు కూడా చదవండి...

టూరిజం, టెంపుల్ కారిడార్లపై సీఎం ప్రత్యేక ప్రణాళిక

సోషల్ మీడియాలో నిబంధనలు మీరితే కఠిన చర్యలు.. డీజీపీ వార్నింగ్

పోలీసులకు బండి భగీరథ్ లేఖ.. మే 15న విచారణకు హాజరవుతా

Read Latest Telangana News And AP News And International News

Updated Date - May 15 , 2026 | 05:22 AM