అమెరికాలో కేసుల నుంచి అదానీకి విముక్తి!?
ABN , Publish Date - May 15 , 2026 | 05:32 AM
అమెరికాలో నమోదైన క్రిమినల్ కేసు నుంచి ఆసియా కుబేరుడు గౌతమ్ అదానీకి అతి త్వరలోనే విముక్తి లభించబోతున్నట్లు సమాచారం...
న్యూఢిల్లీ: అమెరికాలో నమోదైన క్రిమినల్ కేసు నుంచి ఆసియా కుబేరుడు గౌతమ్ అదానీకి అతి త్వరలోనే విముక్తి లభించబోతున్నట్లు సమాచారం. అదానీపై ఆరోపణలను అమెరికా న్యాయ శాఖ ఈ వారాంతంలోగా ఉపసంహరించుకోబోతున్నదని అభిజ్ఞ వర్గాల వ్యాఖ్యలను ఉటంకిస్తూ బ్లూంబర్గ్ కథనం పేర్కొంది. యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (యూఎ్‌స సెక్) కూడా అదానీ, ఇతరులపై 2024 నవంబరులో నమోదు చేసిన మోసం కేసును కూడా సెటిల్ చేసుకోనుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే, అదానీ గ్రూప్‌పై సెక్ కొంత జరిమానా విధించే అవకాశాలు కన్పిస్తున్నాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ నుంచి సౌర విద్యుత్ సరఫరా ఒప్పందాలు చేసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ సహా నాలుగు రాష్ట్రాలకు చెందిన ఉన్నతాధికారులకు 25 కోట్ల డాలర్ల మేరకు లంచాలు ఇచ్చారనే ఆరోపణలపై అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, సాగర్ అదానీ సహా 8 మంది వ్యక్తులపై అమెరికాలో కేసు నమోదైంది. లంచాల సొమ్ము పోగేసేందుకు అదానీ గ్రీన్ ఎనర్జీ తన ప్రాజెక్టుపై తప్పుడు సమాచారమిచ్చి అమెరికా ఇన్వెస్టర్ల నుంచి నిధులు సేకరించిందని ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ చట్టం కింద కేసులు నమోదు చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి...
టూరిజం, టెంపుల్ కారిడార్లపై సీఎం ప్రత్యేక ప్రణాళిక
సోషల్ మీడియాలో నిబంధనలు మీరితే కఠిన చర్యలు.. డీజీపీ వార్నింగ్
పోలీసులకు బండి భగీరథ్ లేఖ.. మే 15న విచారణకు హాజరవుతా
Read Latest Telangana News And AP News And International News