దేశంలో గ్యాస్ కొరత.. గ్యాస్ ఛార్జీలు వసూలు చేస్తున్న హోటల్స్..
ABN , Publish Date - Mar 13 , 2026 | 04:35 PM
గ్యాస్ సిలిండర్ల కొరత కారణంగా పెద్ద సంఖ్యలో హోటళ్లు మూతపడుతున్నాయి. సేవలు కొనసాగిస్తున్న కొన్ని హోటళ్లు సాధారణం కంటే ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నాయి. మరికొన్ని ఆహార పదార్థాలతో పాటు గ్యాస్‌కు కూడా అదనంగా ఛార్జీలు వసూలు చేస్తున్నాయి.
ఇంటర్‌నెట్ డెస్క్: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ప్రపంచ దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. మరీ ముఖ్యంగా ఇండియాలో ఆయిల్, గ్యాస్, ఎరువుల కొరత తీవ్రతరం అయింది. గ్యాస్ కొరత కారణంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలోనే పెద్ద సంఖ్యలో హోటళ్లు మూతపడుతున్నాయి. సేవలు కొనసాగిస్తున్న కొన్ని హోటళ్లు సాధారణం కంటే ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నాయి. మరికొన్ని ఆహార పదార్థాలతో పాటు గ్యాస్‌కు కూడా అదనంగా ఛార్జీలు వసూలు చేస్తున్నాయి.
దేశంలోని ప్రధాన నగరాలైన చెన్నై, బెంగళూరులోని పలు హోటళ్లు గ్యాస్ ఛార్జీలను వసూలు చేస్తున్నాయి. చెన్నైలోని ‘గీరాస్ రెస్టారెంట్’ బిల్లులో ఆహార పదార్థాలతో పాటు గ్యాస్ ఛార్జీలను అదనంగా చేర్చింది. గ్యాస్ ఛార్జీల కింద 9 రూపాయల 52 పైసలు వసూలు చేస్తోంది. బెంగళూరులోని మిస్టర్ ఆంధ్రా మీల్స్ కూడా గ్యాస్ కొరత నేపథ్యంలో గ్యాస్ ఛార్జీలు వసూలు చేస్తోంది. బిల్లులో ఆహార పదార్థాలతో పాటు గ్యాస్ సప్లై ఇష్యూ పేరిట 30 రూపాయలు వసూలు చేస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
గ్యాస్ సిలిండర్ల చోరీ..
గ్యాస్ కొరత నేపథ్యంలో కొంతమంది గ్యాస్ సిలిండర్ల దొంగతనాలకు పాల్పడుతున్నారు. కర్ణాటక రాష్ట్రంలోని చెన్నపట్నంలో వరుసగా గ్యాస్ సిలిండర్లు మాయమవుతున్నాయి. తాజాగా, పట్టణంలోని ఓ కాలనీలో నివసిస్తున్న కుటుంబం ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లింది. ఇదే అదునుగా ఇద్దరు వ్యక్తులు ఆ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. అర్ధరాత్రి వేళ టూవీలర్‌పై వచ్చిన ఆ ఇద్దరు దుండగులు బయట స్టాండ్‌లో ఉంచిన నిండు గ్యాస్ సిలిండర్‌ను ఎత్తుకెళ్లిపోయారు. బెంగళూరులోనూ ఇలాంటి సంఘటనే ఒకటి చోటుచేసుకుంది. గురువారం అర్థరాత్రి బైక్‌పై వచ్చిన ఓ వ్యక్తి ఇంట్లోకి చొరబడి గ్యాస్ సిలిండర్ ఎత్తుకెళ్లిపోయాడు.
ఇవి కూడా చదవండి
సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు.. సినిమా నిర్మాతలకు ఊరట
యువీతో ప్రాక్టీస్ సెషన్.. పంత్ కెరీర్‌కు ప్లస్ అవుతుందా?