Share News

మార్చి నాటికి ట్రావెలర్‌ ఈవీ

ABN , Publish Date - Nov 08 , 2026 | 03:55 AM

వాణిజ్య వాహన తయారీ సంస్థ ఫోర్స్‌ మోటార్స్‌.. తన పాపులర్‌ వాహనం ‘ట్రావెలర్‌’లో ఎలక్ట్రిక్‌ మోడల్‌ను తీసుకువస్తోంది....

మార్చి నాటికి ట్రావెలర్‌ ఈవీ

ఫోర్స్‌ మోటార్స్‌

న్యూఢిల్లీ: వాణిజ్య వాహన తయారీ సంస్థ ఫోర్స్‌ మోటార్స్‌.. తన పాపులర్‌ వాహనం ‘ట్రావెలర్‌’లో ఎలక్ట్రిక్‌ మోడల్‌ను తీసుకువస్తోంది. వచ్చే ఏడాది మార్చి నాటికి ఈ ఎలక్ట్రిక్‌ ట్రావెలర్‌ను మార్కెట్లోకి విడుదల చేయాలని చూస్తున్నట్లు ఫోర్స్‌ మోటార్స్‌ ఎండీ ప్రసన్‌ ఫిరోడియా వెల్లడించారు. తొలుత ట్రావెలర్‌ ఎలక్ట్రిక్‌ అంబులెన్స్‌ను తీసుకురానున్నట్లు ఆయన తెలిపారు. ట్రావెలర్‌ ఎలక్ట్రిక్‌ వాహనాల అభివృద్ధి ఇప్పటికే పూర్తయిందని, ప్రస్తుతం ఆటోమోటివ్‌ రీసెర్చ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఏఆర్‌ఎఐ) వద్ద తుది పరీక్షల ప్రక్రియ జరుగుతోందని చెప్పారు. అనంతరం అర్బేనియా మోడల్‌లోనూ దశల వారీగా ఎలక్ట్రిక్‌ వెర్షన్‌ను తీసుకురానున్నట్లు కంపెనీ వెల్లడించింది. భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇంజనీరింగ్‌, ఎలక్ట్రిక్‌, హైబ్రిడ్‌ సాంకేతికత, డిజిటలైజేషన్‌ విభాగాల్లో రూ.3,000 కోట్ల పెట్టుబడులను పెడుతున్నట్లు ఫోర్స్‌ మోటార్స్‌ తెలిపింది.

ఈ వార్తలు కూడా చదవండి..

గ్లాండ్‌ ఫార్మా లాభం రూ.291 కోట్లు

ధనత్రయోదశి అదుర్స్‌

For More Business News And Telugu News

Updated Date - Nov 08 , 2026 | 03:55 AM