Share News

ఫినో బ్యాంక్ సీఈవో రిషిగుప్తా అరెస్ట్

ABN , Publish Date - Mar 01 , 2026 | 09:50 PM

ఫినో బ్యాంక్ సీఈవో రిషి గుప్తాను డీజీజీఐ అరెస్ట్ చేసింది. అనంతరం ఆయన్ని హైదరాబాద్ ఎకనమిక్ అఫెన్స్ కోర్ట్‌లో హాజరుపరిచారు.

ఫినో బ్యాంక్ సీఈవో రిషిగుప్తా అరెస్ట్
Fino Payments Bank CEO Rishi Gupta

హైదరాబాద్‌, మార్చి 01: ఫినో బ్యాంక్ సీఈవో రిషి గుప్తాను డీజీజీఐ అరెస్ట్ చేసింది. అనంతరం ఆయన్ని హైదరాబాద్ ఎకనమిక్ అఫెన్స్ కోర్ట్‌లో హాజరుపరిచారు. 14 రోజుల పాటు ఆయనకు కోర్టు రిమాండ్ విధించింది. ఆన్ లైన్ గేమింగ్‌ సిండికేట్‌లో భాగంగా ఆయన్ని డీజీజీఐ అరెస్ట్ చేసింది. దాదాపు రూ. 840 కోట్ల మేర జీఎస్టీని ఫినో బ్యాంక్ ఎగగొట్టినట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో రిషి గుప్తా అరెస్ట్ అనివార్యమైంది.


రూ. 13 వేల కోట్లు ఆన్ లైన్ గేమింగ్ సిండికేట్‌గా జరిగినట్లు గుర్తించారు. అందులో ఫినో బ్యాంక్ ద్వారా రూ. 3 వేల కోట్ల లావాదేవీలు జరిగినట్లు డీజీజీఐ గుర్తించింది. అయితే భారీగా అంటే.. రూ. 840 కోట్ల మేర ఫినో బ్యాంక్ ట్యాక్స్ ఎగగొట్టినట్లు కనుగొంది. ఈ పరిణామాల నేపథ్యంలో స్టాక్ ఎక్చేంజ్‌కు ఫినో పేమెంట్స్ బ్యాంక్ వివరణ ఇచ్చింది. ఈ వ్యవహారం బిజినెస్ భాగస్వాములందరికి సంబంధించినదని స్పష్టం చేసింది. కానీ బ్యాంక్‌కు ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చింది.


ఇక ఫినో బ్యాంక్ తాత్కాలిక సీఈఓగా కేతన్ మర్చంట్‌ను నియమించింది. కేతన్.. ప్రస్తుతం ఈ బ్యాంక్ సీఎఫ్ఓగా విధులు నిర్వహిస్తున్నారు. ఫినో బ్యాంకు కీలక పరిణామాల నేపథ్యంలో ఆ బ్యాంక్ షేర్లు 7.5 శాతానికి పడిపోయాయి.

Updated Date - Mar 01 , 2026 | 09:55 PM