Share News

హైదరాబాద్‌లో ఎక్సికామ్‌ ప్లాంట్‌

ABN , Publish Date - Mar 17 , 2026 | 02:10 AM

ఈవీ చార్జింగ్‌ పరికరాల ఉత్పత్తి కోసం ఎక్సికామ్‌ టెలి-సిస్టమ్స్‌ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్లాంటులో ఉత్పత్తి ప్రారంభమైంది.

హైదరాబాద్‌లో ఎక్సికామ్‌ ప్లాంట్‌

రూ.216 కోట్లతో ఏర్పాటు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఈవీ చార్జింగ్‌ పరికరాల ఉత్పత్తి కోసం ఎక్సికామ్‌ టెలి-సిస్టమ్స్‌ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్లాంటులో ఉత్పత్తి ప్రారంభమైంది. రూ.216 కోట్ల పెట్టుబడితో 18.4 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఈ కొత్త ప్లాంటులో కంపెనీ ఈవీ చార్జిం గ్‌ పరికరాలు, డీసీ ఫాస్ట్‌ చార్జర్లు, ఏసీ చార్జర్లు, రెక్టిఫైర్స్‌, కంట్రోలర్లు, లిథియం-అయాన్‌ బ్యాటరీ మాడ్యూల్స్‌ వంటి పవర్‌ ఎలకా్ట్రనిక్స్‌ ఉత్పత్తులు తయారు చేయనుంది. ఎక్సికామ్‌ టెలి-సిస్టమ్స్‌కి భారత్‌లో ఇది రెండో ప్లాంటు. ఇప్పటికే గురుగ్రామ్‌ వద్ద కంపెనీకి ఒక ఉత్పత్తి యూనిట్‌ ఉంది. హైదరాబాద్‌ యూనిట్‌లో తయారు చేసే ఉత్పత్తులను భారత్‌తో పాటు అమెరికా, యూరప్‌, ఆగ్నేయాసియా దేశాలకూ ఎగుమతి చేయనుంది. ప్రస్తుతం హైదరాబాద్‌ ప్లాంటులో దాదాపు 450 మంది ఉద్యోగులు పని చేస్తున్నట్టు కంపెనీ తెలిపింది.

ఈ వార్తలు కూడా చదవండి..

మొయినాబాద్‌ డ్రగ్స్ కేసు.. కఠిన చర్యలు తప్పవు: ఈగల్‌ ఎస్పీ గిరిధర్‌

రేవంత్‌రెడ్డి జూనియర్ యోగిలా మారారు.. హరీశ్‌రావు సెటైర్లు

ఫామ్ హౌస్‌లో డ్రగ్స్ పార్టీ గుట్టురట్టు.. 11 మంది అరెస్ట్

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - Mar 17 , 2026 | 02:10 AM