ఎటర్నల్ కొత్త సారథి అల్బీందర్ థిండ్సా
ABN , Publish Date - Jan 22 , 2026 | 05:37 AM
జొమాటో, బ్లింకిట్‌ల మాతృసంస్థ ఎటర్నల్ సీఈఓ, ఎండీ దీపీందర్ గోయెల్ రాజీనామా చేశారు. ప్రస్తుతం బ్లింకిట్ సీఈఓగా ఉన్న అల్బీందర్ థిండ్సాను ఆయన స్థానంలో...
న్యూఢిల్లీ: జొమాటో, బ్లింకిట్‌ల మాతృసంస్థ ఎటర్నల్ సీఈఓ, ఎండీ దీపీందర్ గోయెల్ రాజీనామా చేశారు. ప్రస్తుతం బ్లింకిట్ సీఈఓగా ఉన్న అల్బీందర్ థిండ్సాను ఆయన స్థానంలో కొత్త సారథిగా నియమించినట్టు కంపె నీ ప్రకటించింది. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఈ మార్పు లు వర్తిస్తాయి. బుధవారం సమావేశమైన డైరెక్టర్ల బోర్డు గోయెల్ రాజీనామాను, అల్బీందర్ నియామకాన్ని కూడా ఆమోదించింది. గోయెల్ కంపెనీ వాటాదారులకు ఒక లేఖ రాస్తూ వైస్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరిస్తున్న కారణంగా తాను ప్రస్తుత పదవికి రాజీనామా చేసినట్టు తెలిపారు. వాటాదారుల అనుమతులకు లోబడి గోయెల్‌ను ఐదేళ్ల కాలానికి వైస్ చైర్మన్, డైరెక్టర్‌గా నియమించినట్టు కంపెనీ తెలిపింది.
క్యూ3 లాభం రూ.102 కోట్లు
డిసెంబరుతో ముగిసిన తృతీయ త్రైమాసికం (క్యూ3)లో రూ.102 కోట్ల కన్సాలిడేటెడ్ లాభం ఆర్జించినట్టు ఎటర్నల్ తెలిపింది. ఏడాది క్రితంతో పోల్చితే ఇది 72.88ు అధికం. క్విక్ కామర్స్ విభాగం ఆదాయం కొన్ని రెట్లు పెరిగి రూ.1,399 కోట్ల నుంచి రూ.12,256 కోట్లకు చేరుకుంది.
ఇవి కూడా చదవండి..
కాకినాడ పీబీసీ కాల్వలో స్పిరిట్ లారీ బోల్తా.. ప్రజలకు అధికారుల హెచ్చరికలు
భారత్, ఇజ్రాయెల్ ఆర్థిక సహకారానికి దావోస్ వేదిక: సీఎం చంద్రబాబు
Read Latest AP News And Telugu News