Share News

ఎంటార్‌ టెక్‌ లాభంలో 14 రెట్ల వృద్ధి

ABN , Publish Date - Oct 30 , 2026 | 05:53 AM

ఎంటార్‌ టెక్నాలజీస్‌ లిమిటెడ్‌..సెప్టెంబరుతో త్రైమాసికంలో రూ.59.8 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది..

ఎంటార్‌ టెక్‌ లాభంలో 14 రెట్ల వృద్ధి

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఎంటార్‌ టెక్నాలజీస్‌ లిమిటెడ్‌..సెప్టెంబరుతో త్రైమాసికంలో రూ.59.8 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంలో ఆర్జించిన నికర లాభం రూ.4.2 కోట్లతో పోల్చితే వృద్ధి 1,309 శాతంగా ఉంది. సమీక్షా త్రైమాసికంలో కార్యకలాపాల నుంచి రాబడి 200 శాతం వృద్ధితో రూ.135.6 కోట్ల నుంచి రూ.406.8 కోట్లకు చేరుకుంది. కంపెనీ ప్రతి త్రైమాసికంలోనూ బలమైన పనితీరును కనబరుస్తోందని ఎంటార్‌ టెక్నాలజీస్‌ ఎండీ శ్రీనివాస్‌ రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంకన్నా ద్వితీయార్ధం మరింత బలంగా ఉంటుందని తాము అంచనా వేస్తున్నామన్నారు.

ఇవి కూడా చదవండి:

డబ్ల్యూపీఎల్ వేలంలో అన్‌సోల్డ్.. మైదానంలో రికార్డుల మోత..

28 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. ఇకపై ఐటీ రంగంలో కొత్త బాధ్యతలు

ముంబై ఇండియన్స్ కీలక నిర్ణయం.. ముగ్గురు కోచ్‌లకు వీడ్కోలు

Updated Date - Oct 30 , 2026 | 05:53 AM