విద్యా రుణాలకు తగ్గుతున్న డిమాండ్
ABN , Publish Date - Nov 19 , 2026 | 03:07 AM
ఆర్థిక అనిశ్చితుల ప్రభావం విద్యా రుణాల మీదా కనిపిస్తోంది. అమెరికాలో రెండోసారి ట్రంప్ జమానా ప్రారంభమైనప్పటి నుంచి చాలా మంది భారతీయ విద్యార్థులు....
చుట్టుముడుతున్న ఆటుపోట్లు
ట్రాన్స్‌యూనియన్ సిబిల్
ముంబై: ఆర్థిక అనిశ్చితుల ప్రభావం విద్యా రుణాల మీదా కనిపిస్తోంది. అమెరికాలో రెండోసారి ట్రంప్ జమానా ప్రారంభమైనప్పటి నుంచి చాలా మంది భారతీయ విద్యార్థులు అక్కడ ఉన్నత విద్యకు వెళ్లడం లేదు. తక్కువ బడ్జెట్‌లో వచ్చే ఇతర దేశాలవైపు వారు మొగ్గు చూపుతున్నారు. దీనికి తోడు ఆర్థిక పరిస్థితులు రోజురోజుకీ అస్తవ్యస్తంగా మారడంతో చాలా మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎడ్యుకేషన్ లోన్లతో ఉన్నత విద్య కొనసాగించేందుకు ఇష్టపడటం లేదు. దీంతో 2023 నుంచి చూస్తే ఈ సంవత్సరం జనవరి-జూన్ మధ్య కాలంలో విద్యా రుణాలు తీసుకునే వారి సంఖ్య, వారు తీసుకునే సగటు రుణాల మొత్తం దాదాపు సగానికి పడిపోయింది. 2023 జనవరి-జూన్‌లో విద్యా రుణాల సగటు మొత్తం రూ.14.3 లక్షలుగా ఉంటే.. ఈ ఏడాది జనవరి-జూన్ మధ్య కాలంలో అది రూ.7.5 లక్షలకు పడిపోయింది. ట్రాన్స్‌యూనియన్ సిబిల్ తన తాజా నివేదికలో ఈ విషయం తెలిపింది. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో విద్యా రుణాలు తీసుకున్న వారిలో 42 శాతం మంది సగటు రుణ మొత్తం మరీ తక్కువగా రూ.లక్ష లోపే ఉందని ఆ సంస్థ తెలిపింది.
2019తో పోలిస్తే..: కాగా 2019తో పోలిస్తే విద్యా రుణాల మొత్తం 3.2 రెట్లు పెరిగాయి. ఇదే సమయంలో రుణ ఖాతాల సంఖ్య 40 శాతం మాత్రమే పెరిగినట్టు ట్రాన్స్‌యూనియన్ సిబిల్ నివేదిక తెలిపింది. సగటు రుణ మొత్తాలు పెరగడం ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల్లో చాలా మంది విద్యార్ధులు లేదా ఉద్యోగులకు రూ.లక్ష లోపే విద్యా రుణాలు తీసుకుంటూ, వాటిని తమ నైపుణ్యాలకు సానపెట్టుకునేందుకు ఉపయోగిస్తున్నట్టు పేర్కొంది. ఈ రుణాల్లో ఎక్కువ భాగాన్ని బ్యాంకుల నుంచే తీసుకుంటున్నారు.
నివేదిక ఇతర ప్రధాన అంశాలు
జనవరి-జూన్ మధ్య కాలంలో మంజూరైన విద్యా రుణాల్లో రూ.లక్ష నుంచి రూ.4 లక్షల రుణాల వాటా 27 శాతం
రూ.4లక్షల నుంచి రూ.7.5 లక్షల రుణాల వాటా 14 శాతం
2019 జనవరి-జూన్‌తో పోలిస్తే 2026 జనవరి-జూన్‌లో బ్యాంకుల నుంచి తీసుకునే విద్యా రుణాల సగటు మొత్తం రూ.14.8 లక్షల నుంచి రూ.4.6 లక్షలకు తగ్గాయి
ఇదే సమయంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు సగటు విద్యా రుణాల మొత్తం రూ.10.4 లక్షల నుంచి రూ.12.3 లక్షలకు చేరుకున్నాయి.
ప్రైవేటు బ్యాంకుల సగటు విద్యా రుణాల మొత్తం రూ.7.9 లక్షల నుంచి రూ.29.6 లక్షలకు పెరిగాయి విద్యా రుణాలు, రుణ మొత్తాల్లో అగ్రస్థానంలో మహారాష్ట్ర
ఉండగా.. విద్యా రుణాల సగటు మొత్తం తెలంగాణలో రూ.15.4 లక్షలు, ఆంధ్రప్రదేశ్‌లో రూ.14.5 లక్షలు ఉంది.
ఇవి కూడా చదవండి..
కశ్మీర్‌లో మళ్లీ ఎన్‌కౌంటర్.. ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు..
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..