ట్రంప్ మళ్లీ టారీఫల బెదిరింపులు
ABN , Publish Date - May 02 , 2026 | 02:35 AM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ టారి్‌ఫల బెదిరింపులకు దిగారు. యూరోపియన్ యూనియన్ (ఈయూ) దేశాల నుంచి...
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ టారి్‌ఫల బెదిరింపులకు దిగారు. యూరోపియన్ యూనియన్ (ఈయూ) దేశాల నుంచి దిగుమతయ్యే కార్లు, ట్రక్కులపై ప్రస్తుతం ఉన్న 15 శాతం సుంకాన్ని 25 శాతానికి పెంచేస్తానని ప్రకటించారు. వచ్చే వారం నుంచే ఈ సుంకాల పెంపు ఉంటుందని ప్రకటించారు. గత ఏడాది జూలైలో కుదిరిన వాణిజ్య ఒప్పందాన్ని ఈయూ సరిగా అమలు చేయకపోవడమే ఇందుకు కారణమన్నారు. ఈయూ ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. ఇప్పటికే గల్ఫ్ యుద్ధంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ట్రంప్ తాజా సుంకాల యుద్ధంతో మరింత కష్టాల్లోకి జారుకుంటుందని భావిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
నేను సీఎం కావాలన్నా.. కుర్చీ ఖాళీగా లేదు
జీవితంలో ఓడి... పదిలో గెలిచిన వర్షిత..
Read Latest Telangana News and National News