Share News

దొడ్ల డెయిరీ లాభంలో 44 శాతం క్షీణత

ABN , Publish Date - Oct 30 , 2026 | 04:52 AM

దొడ్ల డెయిరీ లిమిటెడ్‌ సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికానికి రూ.36.59 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది...

దొడ్ల డెయిరీ లాభంలో 44 శాతం క్షీణత

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): దొడ్ల డెయిరీ లిమిటెడ్‌ సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికానికి రూ.36.59 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.65.67 కోట్లతో పోల్చితే లాభం 44 శాతం తగ్గింది. సమీక్షా త్రైమాసికంలో మొత్తం ఆదాయం రూ.1,030.20 కోట్ల నుంచి రూ.1,206.96 కోట్లకు పెరిగింది. పాల సేకరణ వ్యయాలు పెరగడటమే లాభాలు తగ్గటానికి కారణంగా ఉందని కంపెనీ తెలిపింది. కాగా మేడో ఇండియా హోల్డింగ్స్‌ లిమిటెడ్‌ (ఎంఐహెచ్‌ఎల్‌)తో కలిసి దేశంలో ఒక జాయింట్‌ వెంచర్‌ కంపెనీని ఏర్పాటు చేసే ప్రతిపాదనకు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది.

ఈ వార్తలు కూడా చదవండి..

ఎట్టి పరిస్థితుల్లోనూ తాగునీటి సమస్య రావద్దు.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు

ఎల్‌నినోపై తెలంగాణ సర్కార్‌ ఫోకస్‌.. మండల స్థాయిలో ప్రత్యేక కమిటీలు

ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమే ఏఐ వినియోగ లక్ష్యం: భట్టి విక్రమార్క

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Oct 30 , 2026 | 04:52 AM