లాభం రూ.1,127 కోట్లు
ABN , Publish Date - Nov 08 , 2026 | 04:09 AM
దివీస్ లేబొరేటరీస్.. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.1,127 కోట్ల నికర లాభాన్ని...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): దివీస్ లేబొరేటరీస్.. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.1,127 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలం (రూ.689 కోట్లు)తో పోల్చితే లాభం 63ు వృద్ధి చెందింది. సమీక్షా త్రైమాసికంలో మొత్తం ఆదాయం కూడా 35ు వృద్ధితో రూ.2,860 కోట్ల నుంచి రూ.3,770 కోట్లకు పెరిగింది. ఈ కాలంలో ఫారెక్స్ లాభాలు రూ.24 కోట్లుగా ఉన్నట్లు పేర్కొంది. సెప్టెంబరుతో ముగిసిన ప్రథమార్ధానికి గాను రూ.6,907 కోట్ల మొత్తం ఆదాయంపై రూ.2,079 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
గ్లాండ్ ఫార్మా లాభం రూ.291 కోట్లు
For More Business News And Telugu News