Share News

ధ్రువ స్పేస్‌కు రూ.60 కోట్ల నిధులు

ABN , Publish Date - Jul 14 , 2026 | 05:22 AM

హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేసే స్పేస్‌ టెక్‌ కంపెనీ ‘ధ్రువ స్పేస్‌’కు రూ.60 కోట్ల ఫండింగ్‌ లభించింది....

ధ్రువ స్పేస్‌కు రూ.60 కోట్ల నిధులు

న్యూఢిల్లీ: హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేసే స్పేస్‌ టెక్‌ కంపెనీ ‘ధ్రువ స్పేస్‌’కు రూ.60 కోట్ల ఫండింగ్‌ లభించింది. సిడ్బీ వెంచర్‌ క్యాపిటల్‌ లిమిటెడ్‌ నిర్వహణలోని అంతరిక్ష్‌ వెంచర్‌ క్యాపిటల్‌ ఫండ్‌ (ఏవీసీఎఫ్‌) ఈ మొత్తాన్ని సమకూర్చింది. ఏవీసీఎఫ్‌ దేశంలో ఒక స్పేస్‌టెక్‌ కంపెనీకి ఇలా నిధులు సమకూర్చటం ఇదే మొదటిసారి. అంతరిక్ష రంగానికి చెందిన వినూత్న టెక్‌ కంపెనీలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రూ.1,000 కోట్లకు పైగా నిధులతో ఈ వెంచర్‌ క్యాపిటల్‌ ఫండ్‌ను ఏర్పాటు చేసింది.

ఈ వార్తలు కూడా చదవండి...

దేవాలయాల అభివృద్ధిపై సీఎం ప్రత్యేక దృష్టి సారించారు: మంత్రి కొండా సురేఖ

హైదరాబాద్‌లో ఈగల్ ఫోర్స్ మెగా ఆపరేషన్..

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jul 14 , 2026 | 05:22 AM