120 డాలర్లకు క్రూడ్?
ABN , Publish Date - Sep 08 , 2026 | 01:47 AM
పశ్చిమాసియా మళ్లీ రగులుతోంది. హోర్ముజ్ జలసంధి ద్వారా ప్రయాణిస్తున్న సరుకు రవాణా నౌకలపై అమెరికా, ఇరాన్ పరస్పర ప్రతీకార దాడులకు పాల్పడుతున్నాయి. దాంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు వేగంగా ఎగబాకుతున్నాయి.
పశ్చిమాసియాలో సరుకు రవాణా నౌకలపై దాడులు తీవ్రతరమైతే చమురు పైపైకే..
హెచ్చరించిన గోల్డ్‌మన్ శాక్స్ ఇప్పటికే 100 డాలర్లకు చేరువైన ధర
న్యూయార్క్: పశ్చిమాసియా మళ్లీ రగులుతోంది. హోర్ముజ్ జలసంధి ద్వారా ప్రయాణిస్తున్న సరుకు రవాణా నౌకలపై అమెరికా, ఇరాన్ పరస్పర ప్రతీకార దాడులకు పాల్పడుతున్నాయి. దాంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు వేగంగా ఎగబాకుతున్నాయి. గత వారం లో బ్రెంట్ ముడి చమురు ధర దాదాపు 8 శాతం పెరగగా.. యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ (డబ్ల్యూటీఐ) క్రూడ్ 10 శాతం ప్రియమైంది. సోమవారం నాటి ట్రేడింగ్‌లో క్రూడాయిల్ 6 వారాల గరిష్ఠానికి చేరింది. పీపా ధర ఒక దశలో 1 శాతానికి పైగా పెరిగి 97.93 డాలర్లకు ఎగబాకింది. అతి త్వరలో 100 డాలర్ల మైలురాయిని సైతం దాటే అవకాశాలున్నాయి. ప్రపంచానికి 20 శాతం చమురు సరఫరా హోర్ముజ్ జలసంధి ద్వారానే జరుగుతోంది. కాబట్టి, మార్గం ద్వారా సరుకు రవాణా జరిపే నౌకలపై దాడులు తీవ్రతరమైతే ముడి చమురు ధర 120 డాలర్ల వరకు పెరగవచ్చని అంతర్జాతీయ ఇన్వె్‌స్టమెంట్ బ్యాంకింగ్ దిగ్గజం గోల్డ్‌మన్ శాక్స్ అంచనా వేసింది. పశ్చిమాసియాలో గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే, నౌకల ద్వారా సరుకు రవాణాకు అంతరాయాలు తీవ్రతరమయ్యేలా కన్పిస్తున్నదని గోల్డ్‌మన్ శాక్స్‌లో గ్లోబల్ కమోడిటీస్ రీసెర్చ్ విభాగ సహ-అధిపతి డాన్ స్ట్రూవెన్ ఓ ఇంటర్వ్యూలో అన్నారు.
ఇవి కూడ చదవండి
తాత మధు వ్యాఖ్యలు బాధాకరం : స్పీకర్ గడ్డం ప్రసాద్
ఉద్యోగాల పేరుతో మోసం.. పోలీసుల అదుపులో యూట్యూబర్ నందన