Share News

Coal India Subsidiaries Listing: మరిన్ని అనుబంధ సంస్థల లిస్టింగ్‌ కోల్‌ ఇండియా

ABN , Publish Date - Jan 19 , 2026 | 02:32 AM

భారత్‌ కోకింగ్‌ కోల్‌ (బీసీసీఎల్‌) పబ్లిక్‌ ఇష్యూకి ఇన్వెస్టర్ల నుంచి లభించిన అనూహ్యమైన ఆదరణను దృష్టిలో ఉంచుకుని ఇతర అనుబంధ సంస్థల లిస్టింగ్‌పై...

Coal India Subsidiaries Listing: మరిన్ని అనుబంధ సంస్థల లిస్టింగ్‌ కోల్‌ ఇండియా

న్యూఢిల్లీ: భారత్‌ కోకింగ్‌ కోల్‌ (బీసీసీఎల్‌) పబ్లిక్‌ ఇష్యూకి ఇన్వెస్టర్ల నుంచి లభించిన అనూహ్యమైన ఆదరణను దృష్టిలో ఉంచుకుని ఇతర అనుబంధ సంస్థల లిస్టింగ్‌పై కూడా దృష్టి సారించాలని కోల్‌ ఇండియా లిమిటెడ్‌ (సీఐఎల్‌) భావిస్తోంది. ఇటీవల ముగిసిన బీసీసీఎల్‌ ఇష్యూ జారీ అయిన నిమిషాల వ్యవధిలోనే అది నూరు శాతం సబ్‌స్ర్కైబ్‌ అయ్యింది. ప్రభుత్వ సూచనకు అనుగుణంగా తమ సంస్థల వాస్తవ సామర్థ్యాన్ని వెలికి తీయాలనుకుంటున్నామని, ఇందులో భాగంగా ఇతర అనుబంధ కంపెనీల లిస్టింగ్‌కు అనువైన సమయం కోసం మార్కెట్‌ తీరుతెన్నులను నిశితంగా పరిశీలిస్తున్నామని కోల్‌ ఇండియా సీఎండీ బీ.సాయిరామ్‌ తెలిపారు. సోమవారం బీసీసీఎల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో లిస్టింగ్‌ కానుంది. సీఐఎల్‌ అనుబంధ సంస్థల్లో పెద్దవైన మహానది కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌ (ఎంసీఎల్‌), సౌత్‌ ఈస్టర్న్‌ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌ (ఎస్‌ఈసీఎల్‌) లిస్టింగ్‌కు కంపెనీ బోర్డు ఇప్పటికే సూత్రప్రాయ ఆమోదం తెలిపింది.

ఈ వార్తలు కూడా చదవండి..

మాఘమాసం ఎప్పుడు.. ఈ మాసంలో ఏం చేయాలి..

మౌని అమావాస్య ఎప్పుడు?.. ఆ రోజు ఏం చేయాలి..

For More Devotional News And Telugu News

Updated Date - Jan 19 , 2026 | 02:32 AM