Share News

అమెరికా-చైనా కొత్త ట్రేడ్ డీల్.. పన్నులు పరస్పరం తగ్గింపు

ABN , Publish Date - Sep 28 , 2026 | 04:55 PM

అమెరికా, చైనాల మధ్య సాగుతున్న వాణిజ్య చర్చల్లో భాగంగా ఇరుదేశాలు తాజాగా ఒక అంగీకారానికి వచ్చాయి. ఇరుదేశాలు పరస్పరం '30-ఫర్-30' పేరిట టారిఫ్ తగ్గింపు ఉత్పత్తుల జాబితాను విడుదల చేశాయి.

అమెరికా-చైనా కొత్త ట్రేడ్ డీల్.. పన్నులు పరస్పరం తగ్గింపు
China Cuts Tariffs on US Farm Imports, Keeps 10% Duty on Soybeans

ఆంధ్రజ్యోతి, సెప్టెంబర్ 28: అమెరికా, చైనాల దేశాల మధ్య సుదీర్ఘకాలంగా సాగుతున్న వాణిజ్య చర్చలు ఒక కొలిక్కి వచ్చాయి. ఇరుదేశాలు పరస్పరం '30-ఫర్-30' ఫార్ములా పేరిట టారిఫ్ తగ్గింపు ఉత్పత్తుల జాబితాను విడుదల చేశాయి. దీని ప్రకారం దాదాపు 30 బిలియన్ డాలర్ల విలువైన అమెరికన్ నాన్-సెన్సిటివ్ సరుకులపై సుంకాలు తగ్గించేందుకు చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ అంగీకరించగా, అమెరికా కూడా చైనా ఉత్పత్తులపై సడలింపులను ప్రకటించింది. అయితే, అమెరికా నుంచి చైనా అత్యధికంగా దిగుమతి చేసుకునే సోయాబీన్స్‌ని ఈ సుంకాల మినహాయింపు జాబితా నుంచి చైనా మినహాయించింది.

చైనా ఇచ్చిన టారిఫ్ సడలింపులు వివరాలు

చైనా విడుదల చేసిన జాబితా ప్రకారం ఈ క్రింది అమెరికన్ వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాలు తగ్గనున్నాయి.

  • వరి, జొన్నలు, మొక్కజొన్న

  • మాంసం, పాడి ఉత్పత్తులు

  • వెజిటబుల్ ఆయిల్స్, సోయా నూనె, సోయామీల్

  • అటవీ ఉత్పత్తులు, సీఫుడ్, కాస్మొటిక్స్, మెడికల్ డివైజెస్

  • సోయాబీన్స్‌పై 10శాతం సుంకం భారం

చైనా ప్రభుత్వ రంగ సంస్థలు కొనుగోళ్లు పెంచినప్పటికీ, ప్రైవేట్ ప్రాసెసింగ్ సంస్థలు 10శాతం అదనపు పన్నును తట్టుకోవడం కష్టమని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ధరల పరంగా బ్రెజిల్ మొదలైన ఇతర దేశాలతో పోలిస్తే అమెరికా సోయాబీన్స్ రేటు ఎక్కువగా ఉండటమే దీనికి కారణం.

చైనా ఉత్పత్తులకు అమెరికా ఇచ్చిన మినహాయింపులు

వాషింగ్టన్ విడుదల చేసిన 77 వస్తువుల జాబితాలో చైనాకు చెందిన పలు గృహోపకరణాలు ఉన్నాయి

గృహోపకరణాలు: మైక్రోవేవ్ ఓవెన్లు, కాఫీ మేకర్లు, టోస్టర్లు, ఎలక్ట్రిక్ షేవర్లు

ఇతర వస్తువులు: బాణాసంచా, బొమ్మలు, టేబుల్‌వేర్, పరుపులు/బెడ్‌షీట్లు, ప్లే స్కూల్ వస్తువులు, క్రీడా సామగ్రి

'ట్రేడ్ కౌన్సిల్' ఏర్పాటు.. భవిష్యత్ కార్యాచరణ

అదనపు ద్వైపాక్షిక మండలి: వాణిజ్య సంబంధాలను పునరుద్ధరించడానికి ఇరుదేశాలు ఒక ప్రత్యేక'ట్రేడ్ కౌన్సిల్ (Trade Council)' ఏర్పాటుకు అంగీకరించాయి.

30 బిలియన్ డాలర్ల లక్ష్యం: ద్వైపాక్షికంగా $30 బిలియన్ల విలువైన వ్యాపారాన్ని క్రమబద్ధీకరించి నిలకడైన ఆర్థిక సంబంధాలను కొనసాగించడమే ఈ కౌన్సిల్ మొదటి బాధ్యత.

వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు లక్ష్యాలు: సిసిపి ప్రభుత్వ రంగ సంస్థలైన Sinograin, COFCO ఇప్పటికే 12 మిలియన్ మెట్రిక్ టన్నుల అమెరికన్ సోయాబీన్స్‌ను కొనుగోలు చేశాయి. ఇది అమెరికా ఆశిస్తున్న వార్షిక 25 మిలియన్ టన్నుల లక్ష్యంలో దాదాపు సగం.

శిఖరాగ్ర సమావేశం ఫలితాలు

వాషింగ్టన్‌లో యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మధ్య జరిగిన దౌత్య భేటీ తర్వాత ఈ నిర్ణయాలు వెలువడ్డాయి. టారిఫ్ సడలింపులతో పాటు AI పరిజ్ఞాన భద్రత, ఇరుదేశాల మధ్య విమాన సర్వీసుల పెంపు తదితర అంశాలు ఉన్నాయి.


ఈ వార్తలనూ చదవండి:

ట్రంప్‌తో ఆంత్రోపిక్ సీఈఓ భేటీ.. ఏఐ సేఫ్టీపై చర్చ

పాన్ కార్డులో పేరు తప్పు పడిందా..? మొబైల్‌లోనే మార్చుకోండిలా..

Updated Date - Sep 28 , 2026 | 05:14 PM