తయారీకి ఊతమిచ్చేందుకు 6 వర్కింగ్ గ్రూప్‌ల ఏర్పాటు
ABN , Publish Date - Jun 05 , 2026 | 03:54 AM
దేశీయంగా తయారీని ప్రోత్సహించడంతో పాటు దిగుమతులపై ఆధారాన్ని తగ్గించుకునేందుకు, విదేశీ మారక నిల్వలను కాపాడుకునేందుకు...
న్యూఢిల్లీ: దేశీయంగా తయారీని ప్రోత్సహించడంతో పాటు దిగుమతులపై ఆధారాన్ని తగ్గించుకునేందుకు, విదేశీ మారక నిల్వలను కాపాడుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఆరు రంగాల ఆధారిత వర్కింగ్ గ్రూప్‌లను ఏర్పాటు చేసింది. ఆయా మంత్రిత్వ శాఖలు, డిపార్ట్‌మెంట్ అధికారులతో కూడిన ఈ బృందాలు దేశీయంగా తయారీని పెంచగలిగేందుకు అవకాశాలున్న 100 వరకు ఉత్పత్తులను గుర్తించనున్నాయని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. ఆ వంద ఉత్పత్తుల జాబితాను ఖరారు చేసి మూడు వారాల్లో క్యాబినెట్ కార్యదర్శికి నివేదిక సమర్పించనున్నట్లు ఆయన చెప్పారు.
రంగాల వారీగా ఏర్పాటైన వర్కింగ్ గ్రూప్‌లు
ఔషధాలు, బయోటెక్, వైద్య పరికరాలు
రసాయనాలు, పెట్రోకెమికల్స్, టెక్స్‌టైల్స్ అండ్ ఫుట్‌వేర్
క్యాపిటల్ గూడ్స్, ఆటోమోటివ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికిల్స్, అడ్వాన్స్‌డ్ క్యాపిటల్ గూడ్స్
ఎనర్జీ ఞనిర్మాణ పరికరాలు, మౌలిక సదుపాయాలు ఞడిఫెన్స్ అండ్ ఏరోస్పేస్
ఈ వార్తలు కూడా చదవండి..
రేపటి నుంచి భూముల ధరల పెంపు: మంత్రి పొంగులేటి
ప్రతి ఒక్కరూ రేపు సైకిల్ వినియోగించాలి.. ప్రజలకు సీఎం చంద్రబాబు పిలుపు
Read Latest National News And Telugu News