కెనరా బ్యాంక్ లాభం రూ.5,175 కోట్లు
ABN , Publish Date - Oct 15 , 2026 | 06:09 AM
ఈ ఆర్థిక సంవత్సరం(2026-27)లో సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికానికి(క్యూ2) ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్...
బెంగళూరు (ఆంధ్రజ్యోతి): ఈ ఆర్థిక సంవత్సరం(2026-27)లో సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికానికి(క్యూ2) ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్ రూ.5,175 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం(2025-26)లో ఇదే కాలానికి ఆర్జించిన రూ.4,774 కోట్ల లాభంతో పోలిస్తే 8 శాతం వృద్ధి కనబరిచింది. ఈ క్యూ2లో బ్యాంక్ ఆదాయం రూ.40,931 కోట్లకు పెరిగింది. క్రితం ఆర్థిక సంవత్సరంలో ఇదే సమయానికి రూ.38,598 కోట్లుగా నమోదైంది. సమీక్షా త్రైమాసికానికి బ్యాంక్ వడ్డీ ఆదాయం రూ.31,544 కోట్ల నుంచి రూ.35,159 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) 20 శాతం వృద్ధితో రూ.9,141 కోట్ల నుంచి రూ.11,005 కోట్లకు ఎగబాకింది. నికర వడ్డీ మార్జిన్(ఎన్ఐఎం) మాత్రం 2.53 శాతం నుంచి 2.52 శాతానికి తగ్గింది. కాగా, నిర్వహణ లాభం రూ.8,588 కోట్ల నుంచి రూ.8,758 కోట్లకు చేరుకుంది. బ్యాంక్ ఆస్తుల నాణ్యత మరింత మెరుగుపడింది. 2025 సెప్టెంబరు 31 నాటికి 2.35 శాతంగా నమోదైన బ్యాంక్ మొండి బకాయిల(గ్రాస్ ఎన్పీఏ) నిష్పత్తి.. ఈ సెప్టెంబరు చివరినాటికి 1.33 శాతానికి తగ్గింది. నికర ఎన్పీఏలు 0.54 శాతం నుంచి 0.3 శాతానికి జారుకున్నాయి. దాంతో మొండిబాకీల కోసం కేటాయింపులు కూడా రూ.1,504 కోట్ల స్థాయి నుంచి రూ.1,339 కోట్లకు తగ్గాయి.
ఇవి కూడా చదవండి:
తన పని తాను చేశాడు.. ఫలితం వెతుక్కుంటూ వచ్చింది: అశ్విన్
ప్రయాణాన్ని కొత్తగా ప్రారంభిస్తున్నాం.. మళ్లీ ఒక్కటైన క్రికెటర్ పృథ్వీ షా-ఆకృతి
పోలీసుల దాడుల్లో ఓ విద్యార్థిని వినికిడి శక్తి కోల్పోయింది.. దీనికి బాధ్యులెవరు? : రాహుల్ గాంధీ