కెనరా బ్యాంక్ లాభం రూ.4,856 కోట్లు
ABN , Publish Date - Jul 28 , 2026 | 05:37 AM
ప్రభు త్వ రంగంలోని కెనరా బ్యాంక్.. జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో రూ.4,856 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలం (రూ.4,752 కోట్లు)తో పోల్చితే లాభం...
ఎఫ్‌సీఎన్‌ఆర్ డిపాజిట్ల ద్వారా 130 కోట్ల డాలర్ల సమీకరణ లక్ష్యం
బ్యాంక్ ఎండీ, సీఈఓ బ్రజేశ్ కుమార్ సింగ్
బెంగళూరు (ఆంధ్రజ్యోతి): ప్రభు త్వ రంగంలోని కెనరా బ్యాంక్.. జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో రూ.4,856 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలం (రూ.4,752 కోట్లు)తో పోల్చితే లాభం 2 శాతం వృద్ధి చెందింది. సమీక్షా త్రైమాసికంలో మొత్తం ఆదాయం రూ.38,063 కోట్ల నుంచి రూ.39,684 కోట్లకు పెరిగిందని బ్యాంక్ ఎండీ, సీఈఓ బ్రజేశ్ కుమార్ సింగ్ తెలిపారు. వడ్డీ ఆదాయం కూడా రూ.31,003 కోట్ల నుంచి రూ.32,957 కోట్లుగా ఉందని ఆయన పేర్కొన్నారు. కాగా బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) తొలిసారిగా రూ.10,000 కోట్లు దాటిందని సింగ్ తెలిపారు. ఈ కాలంలో ఎన్‌ఐఐ 13 శాతం వృద్ధితో రూ.9,009 కోట్ల నుంచి రూ.10,215 కోట్లకు చేరుకుందని వివరించారు.
త్రైమాసిక సమీక్షా కాలంలో బ్యాంక్ స్థూల మొండి బకాయిలు (ఎన్‌పీఏ) 2.69 శాతం నుంచి 1.57 శాతానికి, నికర ఎన్‌పీఏలు 0.63 శాతం నుంచి 0.36 శాతానికి తగ్గాయని తెలిపారు. జూన్ త్రైమాసికంలో రూ.2,500 కోట్లు రికవరీ చేసినట్లు ఆయన చెప్పారు. అంతేకాకుండా మొండి పద్దుల కోసం చేసిన కేటాయింపులు కూడా రూ.1,845 కోట్ల నుంచి రూ.1,399 కోట్లకు తగ్గినట్లు ఆయన తెలిపారు. ప్రొవిజన్ కవరేజీ రేషియో (పీసీఆర్) 93.17 శాతం నుంచి 94.76 శాతానికి చేరుకుందన్నారు. కాగా బ్యాంక్ గ్లోబల్ బిజినెస్ 14 శాతం వృద్ధి చెంది రూ.29,05,066 కోట్లకు చేరుకోగా మొత్తం డిపాజిట్లు 12 శాతం పెరిగి రూ.16,11,685 కోట్లకు చేరుకున్నాయని సింగ్ తెలిపారు.

77.5 కోట్ల డాలర్ల సమీకరణ
ఫారిన్ కరెన్సీ నాన్ రెసిడెంట్ (బ్యాంక్) డిపాజిట్ విండో ద్వారా ఇప్పటి వరకు 77.5 కోట్ల డాలర్లు సమీకరించినట్లు సింగ్ వెల్లడించారు. ప్రవాస భారతీయులు, ఓవర్సీస్ సిటిజెన్స్ ఆఫ్ ఇండియా (ఓసీఐ), భారతీయ మూలాలు ఉన్న వ్యక్తుల (పీఐఓ) నుంచి విదేశీ కరెన్సీ డిపాజిట్లను ఆకర్షించేందుకు బ్యాంకులకు గత నెలలో ఆర్‌బీఐ అనుమతించిన సంగతి తెలిసిందే. ఎఫ్‌సీఎన్‌ఆర్ (బీ) డిపాజిట్లకు సంబంధించిన గడువు సెప్టెంబరు 30 వరకు ఉండగా ఎక్సటర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ (ఈసీబీ), ఓవర్సీస్ ఫారిన్ కరెన్సీ బారోయింగ్స్ (ఓఎ్‌ఫసీబీ) కోసం గడువు తేదీ డిసెంబరు 31 వరకు ఉంది. ఇందులో ఎఫ్‌సీఎన్‌ఆర్ (బీ) డిపాజిట్ల ద్వారా 130 కోట్ల డాలర్లు, ఈసీబీ, ఓఎ్‌ఫసీబీల ద్వారా మరో 100 కోట్ల డాలర్లు సమీకరించాలని చూస్తున్నట్లు సింగ్ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హైడ్రా చీఫ్ రంగనాథ్‌కు మద్దతుగా రేవంత్ సర్కార్..!
బడా బాబుల జోలికి వెళ్లని హైడ్రా: టీబీజేపీ చీఫ్
Read Latest AP News And Telugu News