భారత మార్కెట్లోకి బీవైడీ డెంజా
ABN , Publish Date - Nov 14 , 2026 | 01:23 AM
చైనా ఆటోమొబైల్ గ్రూప్ బీవైడీకి చెందిన లగ్జరీ బ్రాండ్ డెంజా.. భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది
జెడ్9 జీటీ, డీ9 ఎంపీవీ విడుదల
ముంబై: చైనా ఆటోమొబైల్ గ్రూప్ బీవైడీకి చెందిన లగ్జరీ బ్రాండ్ డెంజా.. భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది. అంతర్జాతీయంగా కార్యకలాపాల విస్తరణలో భాగంగా భారత విపణిలోకి డెంజా జెడ్9 జీటీ, డెంజా డీ9 ఎంపీవీ కారును బీవైడీ విడుదల చేసింది. ఈ కార్ల పరిచయ ధర వరుసగా రూ.90 లక్షలు, రూ.1.56 కోట్లు (ఎక్స్‌షోరూమ్)గా ఉన్నాయి. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా పర్సనలైజేషన్, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ, ప్రత్యేక అనుభూతిని కలిగించే విధంగా ఈ కార్లను తీర్చిదిద్దినట్లు డెంజా వెల్లడించింది. శుక్రవారం నుంచే ఈ కార్ల బుకింగ్స్‌ను కంపెనీ ప్రారంభించింది. అధీకృత డీలర్లు, బ్రాండ్ అధికారిక చానల్స్ ద్వారా రూ.10 లక్షలు చెల్లించి ఈ బుకింగ్స్ చేసుకోవచ్చని పేర్కొంది. డెంజా జెడ్9 జీటీని 122.49 కేడబ్ల్యూహెచ్ రెండో తరం బీవైడీ బ్లేడ్ బ్యాటరీతో తీసుకువచ్చింది. ఒకసారి చార్జింగ్‌తో 670 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. కేవలం 2.7 సెకన్లలో 270 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. అలాగే 115.07 కేడబ్ల్యూహెచ్ రెండో తరం బీవైడీ బ్లేడ్ బ్యాటరీతో కూడిన డీ9 ఎంపీవీ ఒకసారి చార్జింగ్‌తో 730 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది.
ఇవి కూాడా చదవండి..
విచిత్రం: ఓవర్ స్పీడ్‌కు చలానా.. లొకేషన్ మాత్రం అట్లాంటిక్ మహాసముద్రం!
అస్సాంలో ఘోర ప్రమాదం.. మినీబస్సు, కంటైనర్ ట్రక్కు ఢీకొని పలువురి మృతి