Share News

రేసు గుర్రాల్లా సెన్సెక్స్‌, నిఫ్టీ

ABN , Publish Date - Feb 03 , 2026 | 05:06 AM

సెక్యూరిటీ లావాదేవీల పన్నుపై ఏర్పడిన భయాలు తగ్గడంతో సోమవారం సెన్సెక్స్‌, నిఫ్టీ సోమవారం రేసు గుర్రాల్లా పరిగెత్తాయి. సెన్సెక్స్‌ 943.52 పాయింట్లు లాభపడి 81,666.46 వద్ద ముగియగా, నిఫ్టీ 262.95 పాయింట్ల...

రేసు గుర్రాల్లా సెన్సెక్స్‌, నిఫ్టీ

మళ్లీ 25,000 పాయింట్ల పైకి నిఫ్టీ

ముంబై: సెక్యూరిటీ లావాదేవీల పన్నుపై ఏర్పడిన భయాలు తగ్గడంతో సోమవారం సెన్సెక్స్‌, నిఫ్టీ సోమవారం రేసు గుర్రాల్లా పరిగెత్తాయి. సెన్సెక్స్‌ 943.52 పాయింట్లు లాభపడి 81,666.46 వద్ద ముగియగా, నిఫ్టీ 262.95 పాయింట్ల లాభంతో 25,088.40 వద్ద ముగిసింది. ఇంట్రా డేలో సెన్సెక్స్‌ 1,345 పాయింట్లు కోలుకుంది. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ మార్కెట్‌ అంచనాలకు అనుగుణంగా ఉండడం, తగ్గుతున్న కమోడిటీల ధరలు, భారత-అమెరికా వాణిజ్య ఒప్పందంపై చర్చలు త్వరలోనే ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందన్న వార్తలు, ముడి చమురు ధర భారీగా తగ్గడం కూడా సోమవారం మార్కెట్‌కు కలిసి వచ్చాయి. దీంతో ఇన్వెస్టర్లు బ్లూచిప్‌ షేర్లు, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, బ్యాంకింగ్‌, ఆటోమొబైల్‌ కంపెనీల షేర్లను ఎగబడి కొన్నారు.

కోలుకున్న ‘బ్రోకరేజి’ షేర్లు : ఆదివారం కుప్పకూలిన స్టాక్‌ బ్రోకరేజి కంపెనీల షేర్లు సోమవారం బాగా కోలుకున్నాయి. ఏంజెల్‌ వన్‌ కంపెనీ షేర్లయితే బీఎ్‌సఈలో నాలుగు శాతం లాభంతో రూ.2,405.05 వద్ద ముగిశాయి. సోమవారం ఉదయం ట్రేడింగ్‌ ప్రారంభంలో సూచీలతో పాటు ఈ కంపెనీల షేర్లూ నష్టపోయాయి. అయితే కొద్ది సేపటికే మార్కెట్‌ లాభాల బాట పట్టడంతో ఈ షేర్లూ లాభాల బాట పట్టాయి.

రూ.36,000 కోట్ల ఎఫ్‌పీఐ పెట్టుబడులు ఔట్‌: దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో విదేశీ పోర్టుఫోలియో మదుపరుల (ఎఫ్‌పీఐ) అమ్మకాల హోరు కొనసాగుతోంది. గత నెలలోనూ ఎఫ్‌పీఐలు దేశీయ స్టాక్‌ మార్కెట్‌ నుంచి రూ.35,962 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. గత ఏడాది మొత్తాన్ని పరిగణనలోకి తీసుకున్నా ఈ సంస్థలు రూ.1.66 లక్షల కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి.


పీఎ్‌ఫసీ-ఆర్‌ఈసీ విలీనం!?: న్యూఢిల్లీ: విద్యుత్‌ రంగానికి రుణాలిచ్చే ప్రభుత్వ రంగ నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (పీఎ్‌ఫసీ), దాని అనుబంధ విభాగం రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పొరేషన్‌(ఆర్‌ఈసీ) లిమిటెడ్‌ ఏకం కానున్నా యి. పీఎ్‌ఫసీ, ఆర్‌ఈసీలను పునర్‌వ్యవస్థీకరించనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆదివారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రకటించారు. ఆ ప్రక్రియలో భాగంగా, పీఎఫ్‌సీలో ఆర్‌ఈసీని విలీనం చేయాలని కేంద్రం భావిస్తున్నదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దేశంలో విద్యుత్‌ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ ప్రాజెక్టులకు నిధు లు సమకూర్చడంలో ఈ రెండు కంపెనీలదే కీలకపాత్ర.

ఇవీ చదవండి:

అత్యాశకు పోయి.. రూ.10 లక్షల అప్పు చేసి పసిడి కొంటే..

బంగారం @ 9 వేలు, వెండి @ 50 వేలు.. భారీగా పతనమైన ధరలు..

Updated Date - Feb 03 , 2026 | 05:06 AM