Share News

ఆఖరి గంటలో కొనుగోళ్లు నష్టాల్లోంచి లాభాల్లోకి సూచీలు

ABN , Publish Date - Aug 26 , 2026 | 05:40 AM

అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు గణనీయంగా తగ్గడం మార్కెట్లో ట్రేడింగ్‌ సెంటిమెంట్‌ను మెరుగుపరిచింది. ఇన్వెస్టర్లు ఆఖరి గంటలో కొనుగోళ్లు పెంచడంతో మంగళవారం...

ఆఖరి గంటలో కొనుగోళ్లు నష్టాల్లోంచి లాభాల్లోకి సూచీలు

ముంబై: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు గణనీయంగా తగ్గడం మార్కెట్లో ట్రేడింగ్‌ సెంటిమెంట్‌ను మెరుగుపరిచింది. ఇన్వెస్టర్లు ఆఖరి గంటలో కొనుగోళ్లు పెంచడంతో మంగళవారం ఆరంభం నుంచి నష్టాల్లో సాగిన ప్రామాణిక సూచీలు చివరికి మోస్తరు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 286.98 పాయింట్ల వృద్ధితో 77,656.09 వద్దకు చేరింది. నిఫ్టీ 115.50 పాయిం ట్ల పెరుగుదలతో 24,334.55 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌లోని 30 నమోదిత కంపెనీల్లో 24 రాణించగా.. ఇండిగో షేరు 2.05 శాతం ఎగబాకింది. ఫారెక్స్‌ మార్కెట్‌ విషయానికొస్తే, డాలర్‌తో రూపాయి మారకం విలువ 24 పైసలు పెరిగి రూ.95.46 వద్ద ముగిసింది. చమురు ధరల తగ్గుదల, డాలర్‌ బలహీనపడటం ఇందుకు తోడ్పడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ ముడి చమురు పీపా ధర ఒక దశలో 3.15 శాతం తగ్గి 89.35 డాలర్ల స్థాయికి దిగివచ్చింది.

బంగారం పైపైకే..: దేశీయంగా పసిడి వరుసగా నాలుగో రోజూ ఎగబాకింది. ఢిల్లీ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత బంగారం 10 గ్రాముల ధర మరో రూ.2,700 పెరిగి రూ.1,67,100కు చేరింది. కిలో వెండి రేటు మాత్రం రూ.3,500 తగ్గి రూ.2.50 లక్షలకు దిగివచ్చింది. అంతర్జాతీయ మార్కెట్‌ విషయానికొస్తే, ఔన్స్‌ (31.10 గ్రాములు) గోల్డ్‌ రేటు ఒక దశలో 4,700 డాలర్ల దిగువకు జారుకోగా.. సిల్వర్‌ 68 డాలర్ల కింది స్థాయికి పడిపోయింది.

ఈ వార్తలనూ చదవండి:

ఏడేళ్ల తర్వాత భారత్‌కు జిన్‌పింగ్.. బ్రిక్స్ సదస్సుకు 400 మందితో భారీ బృందం..

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీకి సంబంధించిన అరుదైన వీడియో విడుదల!

Updated Date - Aug 26 , 2026 | 05:40 AM