Share News

పెట్రోల్‌పై రూ.5.. డీజిల్‌పై రూ.23

ABN , Publish Date - Sep 10 , 2026 | 02:10 AM

కొండెక్కిన చమురు ధర.. ప్రభుత్వ రంగ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీ(ఓఎంసీ)లకు...

పెట్రోల్‌పై రూ.5.. డీజిల్‌పై రూ.23

చమురు ధరల పెరుగుదలతో పెరిగిన ఇంధన విక్రయ కంపెనీల నష్టాలు

న్యూఢిల్లీ: కొండెక్కిన చమురు ధర.. ప్రభుత్వ రంగ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీ(ఓఎంసీ)లకు గుదిబండగా మారింది. దీంతో ఓఎంసీలు లీటర్‌ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.23 చొప్పున నష్టపోతున్నాయి. గృహ అవసరాలకోసం సరఫరా చేసే ఒక్కో వంట గ్యాస్‌ సిలిండర్‌పైనా ఓఎంసీలు రూ.200వరకు నష్టపోతున్నాయి. ముడిచమురు ధర పెరుగుదలకు అనుగుణంగా ఓఎంసీలు గత మూడు నెలలుగా తమ రిటైల్‌ ధరలు పెంచకపోవడం ఇందుకు ప్రధాన కారణం.

109 డాలర్లకు చమురు దిగుమతి ధర: మన దేశం దిగుమతి చేసుకునే ప్రధాన ముడి చమురు రకాల సగటు ధర ఏకంగా 109 డాలర్లకు చేరింది. దీంతో ధరల సెగను కట్టడి చేసేందుకు అక్టోబరు 7న వెలువరించే ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షలో ఆర్‌బీఐ కీలక రెపో రేటును పావు శాతం నుంచి అర శాతం వరకు పెంచుతుందనే అంచనాలు వినిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి..

ఎస్-400, ఎస్‌యు-57, బ్రహ్మోస్‌పై భారత్‌ ఫోకస్.. మోదీ-పుతిన్ భేటీలో కీలక చర్చలు..

మరో పదేళ్లలో మనుషుల్ని ఏఐ చంపేయొచ్చు.. ఆంత్రోపిక్‌ పరిశోధకుడి సంచలన హెచ్చరిక..

Updated Date - Sep 10 , 2026 | 02:10 AM