మళ్లీ నష్టాల్లోకి మార్కెట్లు
ABN , Publish Date - May 16 , 2026 | 03:13 AM
వరుసగా రెండు రోజులు లాభాల బాటలో సాగిన దేశీయ ప్రామాణిక ఈక్విటీ సూచీలు శుక్రవారం మళ్లీ నష్టాలతో ముగిశాయి. మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, పీఎ్‌సయూ బ్యాంకుల షేర్లలో...
సెన్సెక్స్ 161 పాయింట్లు డౌన్
ముంబై: వరుసగా రెండు రోజులు లాభాల బాటలో సాగిన దేశీయ ప్రామాణిక ఈక్విటీ సూచీలు శుక్రవారం మళ్లీ నష్టాలతో ముగిశాయి. మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, పీఎ్‌సయూ బ్యాంకుల షేర్లలో అమ్మకాలతో పాటు ముడి చమురు ధరల పెరుగుదల నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్తత స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగియడానికి కారణమయ్యాయి. బీఎ్‌సఈ సెన్సెక్స్ లాభనష్టాల మధ్య ఊగిసలాడి 160.73 పాయింట్ల నష్టంతో 75,237.99 వద్ద ముగిసింది. ప్రారంభ ట్రేడింగ్‌లో సెన్సెక్స్ దాదాపు 470 పాయింట్ల మేర దూసుకుపోయింది. ఇక ఎన్‌ఎ్‌సఈ నిఫ్టీ 46.10 పాయింట్ల నష్టంతో 23,643.50 వద్ద ముగిసింది.
బంగారం రూ.3,200..వెండి రూ.21,600 తగ్గాయ్..: బంగారం, వెండి ధరలు దిగొచ్చాయి. ఢిల్లీ మార్కెట్లో శుక్రవారం 10 గ్రాముల బంగారం (99.9 శాతం స్వచ్ఛత) ధర రూ.3,200 తగ్గి రూ.1,62,800కు చేరుకోగా.. కిలో వెండి ధర రూ.21,600 తగ్గి రూ.2.75 లక్షలకు చేరుకున్నట్టు అఖిల భారత సరాఫా అసోసియేషన్ పేర్కొంది. డాలర్ బలపడటం, ఇన్వెస్టర్లు భారీగా లాభాల స్వీకరణకు దిగడంతో ఈ రెండు లోహాల ధరలు దిగివచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ (31.10 గ్రాములు) స్పాట్ గోల్డ్ ధర 104 డాలర్లకు పైగా తగ్గి 4,548.46 డాలర్లు, ఔన్స్ వెండి ధర 5.26 డాలర్లు తగ్గి 78.21 డాలర్ల స్థాయిలో ట్రేడయ్యాయి.
ఈ వార్తలనూ చదవండి:
కేంద్రం కీలక నిర్ణయం.. పసిడి దిగుమతిపై పరిమితి
42 నెలల గరిష్ఠానికి టోకు ధరల ద్రవ్యోల్బణం