వచ్చే ఏడాది ఎల్‌ఐసీ ఎఫ్‌పీఓ
ABN , Publish Date - Feb 03 , 2026 | 05:01 AM
వచ్చే ఆర్థిక సంవత్సరంలో మలి విడత పబ్లిక్ ఆఫరింగ్ (ఎఫ్‌పీఓ) ద్వారా ఎల్‌ఐసీలో తన వాటాను కేంద్ర ప్రభుత్వం మరింత తగ్గించుకోనుందని...
న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరంలో మలి విడత పబ్లిక్ ఆఫరింగ్ (ఎఫ్‌పీఓ) ద్వారా ఎల్‌ఐసీలో తన వాటాను కేంద్ర ప్రభుత్వం మరింత తగ్గించుకోనుందని ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి ఎం నాగరాజు సోమవారం తెలిపారు. ప్రస్తుతం ఎల్‌ఐసీలో కేంద్రం 96.5ు వాటా కలిగి ఉంది. 2022 మే నెలలో కేంద్రం కంపెనీలోని 3.5ు వాటాను ఐపీఓ ద్వారా విక్రయించింది. తద్వారా సర్కారు ఖజానాకు రూ.21,000 కోట్ల ఆదాయం సమకూరింది. 2027 మే నాటికి ప్రభుత్వ రంగ కంపెనీల్లో పబ్లిక్ షేర్‌హోల్డర్ల వాటా కనీసం 10 శాతానికి పెరగాలన్న సెబీ నిబంధన ప్రకారంగా.. కేంద్రం ఎల్‌ఐసీలో మరో 6.5ు వాటా విక్రయించాల్సి ఉంటుంది. దేశంలో అతిపెద్ద బీమా కంపెనీ అయిన ఎల్‌ఐసీ.. షేరు బీఎ్‌సఈలో సోమవారం రూ.804 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ (క్యాపిటలైజేషన్) రూ.5.08 లక్షల కోట్లుగా ఉంది.
ఇవీ చదవండి:
అత్యాశకు పోయి.. రూ.10 లక్షల అప్పు చేసి పసిడి కొంటే..
బంగారం @ 9 వేలు, వెండి @ 50 వేలు.. భారీగా పతనమైన ధరలు..