అంతర్జాతీయ పరిణామాలే కీలకం!
ABN , Publish Date - Jul 20 , 2026 | 04:14 AM
ఈ వారం భారత స్టాక్ మార్కెట్ల దిశను అంతర్జాతీయ పరిణామాలు, జూన్ త్రైమాసిక ఫలితాలు నిర్ణయించే అవకాశం ఉంది. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల్లో హెచ్చుతగ్గులు...
ఈ వారం భారత స్టాక్ మార్కెట్ల దిశను అంతర్జాతీయ పరిణామాలు, జూన్ త్రైమాసిక ఫలితాలు నిర్ణయించే అవకాశం ఉంది. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల్లో హెచ్చుతగ్గులు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను ప్రభావితం చేయనున్నాయి. ఐటీ, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ కంపెనీల ఆర్థిక ఫలితాలపై కన్నేయడం మంచిది. విదేశీ పెట్టుబడుల ప్రవాహం, రూపాయి మారకం విలువ ఆధారంగా ఇన్వెస్టర్లు తమ పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవటం బెటర్.
స్టాక్ రికమండేషన్స్
భారత్ ఫోర్జ్: గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ కౌంటర్ మంచి జోరును కనబరుస్తోంది. ఏకంగా 140 శాతానికి పైగా రాబడిని అందించింది. రిలేటివ్ స్ట్రెంత్, వాల్యూమ్ గణనీయంగా పెరగటం, త్రైమాసిక ఫలితాల అంచనాలు ఈ షేరుపై మరింత ఫోకస్ పెంచాయి. గత శుక్రవారం రూ.2,190 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.2,160 ఎగువన పొజిషన్ తీసుకుని రూ.2,270 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.2,120 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
ఏజిస్ లాజిస్టిక్స్: ఈ ఏడాది మార్చి నుంచి ఈ షేరు 150 శాతానికి పైగా పెరగటం గమనార్హం. గత త్రైమాసికంలో మెరుగైన ఫలితాలు, రిలేటివ్ స్ట్రెంత్, డెలివరీ వాల్యూమ్ వంటివి ఇందుకు కారణం. ఒక్కసారిగా టవర్ ఆకారంలో ఎగిసిన ఈ షేరు రెండు వారాలుగా కొంత దిద్దుబాటుకు లోనైంది. గత శుక్రవారం రూ.1,349 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.1,330/ 1,200 శ్రేణిలో ప్రవేశించి రూ.1,500 టార్గెట్‌తో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.1,280 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
అనంత్‌రాజ్: గత ఏడాది నుంచి డౌన్‌ట్రెండ్‌లో పయనిస్తున్న ఈ షేరు ప్రస్తుతం బ్రేకౌట్‌కు సిద్ధమవుతోంది. ఇప్పటికే క్రాస్‌లైన్ రెసిస్టెన్స్‌ను బ్రేక్ చేసింది. రూ.411 వద్ద మద్దతు తీసుకున్న తర్వాత 40 శాతం మేర పెరిగింది. ఇదే మూమెంటమ్ కొనసాగే అవకాశం కనిపిస్తోంది. గత శుక్రవారం రూ.592 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.580 ఎగువన ప్రవేశించి రూ.650 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.550 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
టీవీఎస్ మోటార్: ఈ ఏడాది మార్చిలో రూ.3,970 స్థాయిలో జీవితకాల గరిష్ఠాన్ని చేరుకున్న తర్వాత ఈ షేరు దిద్దుబాటుకు లోనైంది. ప్రస్తుతం డిస్ట్రిబ్యూషన్ ఫేజ్‌లో ఉన్నాయి. అయితే 200 రోజుల మూవింగ్ యావరేజీ వద్ద మద్దతు దొరికితే పుంజుకునే అవకాశం కనిపిస్తోంది. గత శుక్రవారం రూ.3,618 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.3,600 ఎగువన పొజిషన్ తీసుకుని రూ.3,800/3,900 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.3,570 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
జేఎ్‌సడబ్ల్యూ స్టీల్: ఈ షేరు దీర్ఘకాలిక అప్‌ట్రెండ్‌లో కొనసాగుతూ వస్తోంది. అయితే అప్పుడప్పుడు కాస్త దిద్దుబాటుకు లోనవుతూ 200 రోజుల మూవింగ్ యావరేజీ వద్ద మద్దతు తీసుకుంటున్నాయి. ఇప్పుడు మరోసారి ఆ అవకాశం కనిపిస్తోంది. జీవితకాల గరిష్ఠం నుంచి 9 శాతం దిద్దుబాటుకు లోనైన ఈ షేరు గత శుక్రవారం రూ.1,237 వద్ద క్లోజైంది. మదుపరులు ఈ కౌంటర్‌లో రూ.1,230 వద్ద ఎంటరై రూ.1,340 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.1,200 స్థాయిని స్టాప్‌లాస్‌గా పెట్టుకోవాలి.
మూర్తి నాయుడు పాదం,
మార్కెట్ నిపుణులు, నిఫ్టీ మాస్టర్
+91 98855 59709
నోట్ : పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మదుపరులు
తమ ఫైనాన్షియల్ అడ్వైజర్ల సలహాలు తీసుకోవాలి.
ఇవీ చదవండి:
'మేడ్ ఇన్ ఇండియా' సీ-295.. ఆత్మనిర్భర్ భారత్‌కు ఊతం
యూసీసీ బిల్లుకు మధ్యప్రదేశ్ కేబినెట్ ఆమోదం.. త్వరలో అసెంబ్లీకి!