Share News

మన ఇళ్లు ‘బంగారు’ లోగిళ్లు

ABN , Publish Date - Apr 11 , 2026 | 06:01 AM

బ్యాంకు డిపాజిట్లు, ఇతర పెట్టుబ డుల కంటే భారతీయుల బంగారాన్నే ఎక్కువగా నమ్ముకుంటున్నారు. భారతీయు గృహా ల్లో పసిడి నిల్వలు ఏటికేటికి పెరిగిపోతూ ఉండడమే ఇందుకు తార్కాణం. మన దేశంలో...

మన ఇళ్లు ‘బంగారు’ లోగిళ్లు

  • భారతీయుల వద్ద 50,000 టన్నుల పసిడి

  • టాప్‌-10 సెంట్రల్‌ బ్యాంకుల కంటే ఎక్కువ

  • అసోచాం నివేదిక

న్యూఢిల్లీ: బ్యాంకు డిపాజిట్లు, ఇతర పెట్టుబ డుల కంటే భారతీయుల బంగారాన్నే ఎక్కువగా నమ్ముకుంటున్నారు. భారతీయు గృహా ల్లో పసిడి నిల్వలు ఏటికేటికి పెరిగిపోతూ ఉండడమే ఇందుకు తార్కాణం. మన దేశంలో ప్రజల వద్ద ప్రస్తుతం ఉన్న బంగారం నిల్వలు అమెరికా, జర్మనీ, జపాన్‌, చైనా వంటి ప్రపంచంలోని టాప్‌-10 దేశాల కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వల కన్నా అధికమని అసోచాం తాజా నివేదికలో తెలిపింది. ప్రస్తుతం దాదాపు 50,000 టన్నుల పసిడి నగలు లేదా బిస్కెట్లు, కడ్డీలు, నాణేల రూపంలో ఇళ్లలోని బీరువాలు లేదా బ్యాంకు లాకర్లలో నిద్రాణంగా పడి మూలుగుతోందని వెల్లడించింది. ఇది దేశ ఆర్థికాభివృద్ధికి ఏ మాత్రం ఉపయోగపడకపోవడం పట్ల అసోచాం విచారం వ్యక్తం చేసింది.

2% పెట్టుబడిగా మారినా జీడీపీ ఉరకలే...: ఏదో ఒక పథకం ద్వారా ప్రభుత్వం ఇందులో ఏటా రెండు శాతం సమీకరించి ఉత్పాదక కార్యక్రమాలకు ఉపయోగించినా 2047 నాటికి భారత జీడీపీ అదనంగా 7.5 లక్షల కోట్ల డాలర్లు (సుమారు రూ.693.75 లక్షల కోట్లు) పెరిగి 41.5 లక్షల కోట్ల డాలర్లకు (సుమారు రూ.3,838.75 లక్షల కోట్లు) చేరుకుంటుందని అసోచాం పేర్కొంది. దేవాలయాల వద్ద ఉన్న పసిడిని కూడా కలిపి చూసినా మన బంగారం నిల్వ 50,000 టన్నుల వరకు ఉంటుందని ఎన్‌ఎ్‌సఈ చీఫ్‌ బిజినెస్‌ డెవల్‌పమెంట్‌ ఆఫీసర్‌ (సీబీడీఓ) శ్రీరామ్‌ కృష్ణన్‌ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రస్తుత మార్కెట్‌ ధర ప్రకారం దీని విలువ 10 లక్షల కోట్ల డాలర్లు (సుమారు రూ.925 లక్షల కోట్లు). గత ఆర్థిక సవత్సరం మన దేశం నమోదు చేసిన 4.5 లక్షల కోట్ల డాలర్ల జీడీపీ కంటే ఇది 5.5 లక్షల కోట్ల డాలర్లు ఎక్కువ.

ఈ వార్తలు కూడా చదవండి

మహిళల జోలికొస్తే అదే చివరి రోజు: మంత్రి సవిత..

బొత్స భావోద్వేగం.. వైఎస్ షర్మిల రియాక్షన్

Updated Date - Apr 11 , 2026 | 06:01 AM