Share News

బంగారం దిగుమతుల్లో 29 శాతం వృద్ధి

ABN , Publish Date - Apr 06 , 2026 | 02:32 AM

ఇటీవలే ముగిసిన 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి 11 నెలల కాలంలో (ఏప్రిల్‌-ఫిబ్రవరి) బంగారం దిగుమతులు 28.73% పెరిగి 6,900 కోట్ల డాలర్లకు (రూ.6.49 లక్షల కోట్లు) చేరాయి...

బంగారం దిగుమతుల్లో 29 శాతం వృద్ధి

న్యూఢిల్లీ: ఇటీవలే ముగిసిన 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి 11 నెలల కాలంలో (ఏప్రిల్‌-ఫిబ్రవరి) బంగారం దిగుమతులు 28.73% పెరిగి 6,900 కోట్ల డాలర్లకు (రూ.6.49 లక్షల కోట్లు) చేరాయి. 2024-25 ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో బంగారం దిగుమతుల విలువ 5,353 కోట్ల డాలర్లుగా (రూ.5.03 లక్షల కోట్లు) ఉంది. అంతర్జాతీయ, దేశీయ విపణులు రెండింటిలోనూ పసిడి ధరల పెరుగుదల ఇందుకు కారణం. బంగారం దిగుమతులు పెరిగిన కారణంగా వాణిజ్య లోటు 31,060 కోట్ల డాలర్లకు (రూ.29.20 లక్షల కోట్లు) చేరినట్టు వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.. ప్రస్తుతం దేశ రాజధానిలో 10 గ్రాముల బంగారం ధర రూ.1,51,500 పలుకుతోంది. మన దేశానికి బంగారం సరఫరా చేస్తున్న దేశాల్లో స్విట్జర్లాండ్‌ 40% వాటాతో అగ్రస్థానంలో ఉండగా 16% వాటాతో యూఏఈ, 10% వాటాతో దక్షిణాఫ్రికా తర్వాతి స్థానాల్లో నిలిచాయి. కాగా భారత దిగుమతుల్లో బంగారం వాటా 5% ఉంది.

ఇవి కూడా చదవండి..

టిక్కెట్ ఇవ్వకపోవడం కాదు, నేనే పోటీ చేయనని చెప్పాను: అన్నామలై

ఐదేళ్లు ప్రశాంతంగా జీవించాలంటే బీజేపీని ఐక్యంగా అడ్డుకోండి.. మమత పిలుపు

Updated Date - Apr 06 , 2026 | 02:32 AM