Share News

హైబ్రిడ్‌ ఎంఎఫ్‌ల్లోకి పెట్టుబడుల వెల్లువ

ABN , Publish Date - May 18 , 2026 | 03:10 AM

హైబ్రిడ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ (ఎంఎఫ్‌) పథకాల్లోకి పెట్టుబడులు వెల్లువెత్తాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకాలు రూ.1.55 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి...

హైబ్రిడ్‌ ఎంఎఫ్‌ల్లోకి పెట్టుబడుల వెల్లువ

2025-26లో రూ.1.55 లక్షల కోట్లు

న్యూఢిల్లీ: హైబ్రిడ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ (ఎంఎఫ్‌) పథకాల్లోకి పెట్టుబడులు వెల్లువెత్తాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకాలు రూ.1.55 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. క్రితం ఆర్థిక సంవత్సరం (రూ.1.2 లక్షల కోట్లు)తో పోల్చితే 29ు పెరుగుదల నమోదైంది. మార్కెట్‌ ఒడుదొడుకుల నేపథ్యంలో వైవిధ్యభరితమైన పెట్టుబడి వ్యూహాలవైపు ఇన్వెస్టర్లు మొగ్గుచూపడంతో హైబ్రిడ్‌ ఎంఎఫ్‌ పథకాల్లోకి పెట్టుబడుల ప్రవాహం పెరిగింది. పశ్చిమాసియాలో యుద్ధంతో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ మార్కెట్‌ ఒడుదొడుకుల నుంచి రక్షణనిచ్చే సమతుల్య పెట్టుబడి పరిష్కారాల కోసం పెట్టుబడిదారులు వీటిని ఎంచుకున్నారు. మార్కెట్‌ ఒడుదొడుకుల నేపథ్యంలో ఇన్వెస్టర్ల నుంచి హైబ్రిడ్‌ ఫండ్స్‌ మంచి ఆదరణను పొందాయని ఎడెల్‌వీస్‌ మ్యూచువల్‌ ఫండ్‌ ఎండీ, సీఈవో రాధికా గుప్తా తెలిపారు. వివిధ మార్కెట్‌ పరిస్థితులలో స్థిరమైన పనితీరును కనబరిచే సామర్థ్యం ఉన్నందున ముఖ్యంగా ‘మల్టీ అసెట్‌ అలొకే షన్‌ ఫండ్స్‌’ బాగా ప్రాచుర్యం పొందినట్టు చెప్పారు. తక్కువ రిస్క్‌తో ఈక్విటీలలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి హైబ్రిడ్‌ ఫండ్స్‌ ప్రధాన ఎంపికగా మారుతున్నాయని గుప్తా పేర్కొన్నారు. 2024-25 నాటికి హైబ్రిడ్‌ పథకాల నిర్వహణలోని ఆస్తులు (ఏయూఎం) రూ.8.83 లక్షల కోట్లు ఉండగా.. 2025-26 నాటికి రూ.10.35 లక్షల కోట్లకు పెరిగాయి.

ఈ వార్తలనూ చదవండి:

ప్రపంచంలో అతిపెద్ద ఏఐ టెక్‌ కంపెనీగా టీసీఎస్‌

బంగారంలో పెట్టుబడులకు గోల్డ్‌ ఈటీఎఫ్‌, ఈజీఆర్‌లు

Updated Date - May 18 , 2026 | 03:10 AM