సిల్వర్ రూ.5,000 డౌన్
ABN , Publish Date - Nov 17 , 2026 | 05:49 AM
విలువైన లోహాల ధరలు వరుసగా ఐదో రోజూ తగ్గా యి. ఢిల్లీ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత బంగారం 10 గ్రాముల రేటు రూ.900 తగ్గి..
రూ.1.79 లక్షలకు కిలో ధర
రూ.900 తగ్గిన బంగారం
న్యూఢిల్లీ: విలువైన లోహాల ధరలు వరుసగా ఐదో రోజూ తగ్గా యి. ఢిల్లీ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత బంగారం 10 గ్రాముల రేటు రూ.900 తగ్గి రూ.1.40 లక్షలకు జారుకుంది. కిలో వెండి ఏకంగా రూ.5,000 తగ్గుదలతో రూ.1.79 లక్షలకు దిగివచ్చింది. అంతర్జాతీయంగా ధరల పతనం, రూపాయి బలోపేతం ఇందుకు కారణం. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఔన్స్ (31.10 గ్రాములు) గోల్డ్ రేటు 10.87 డాలర్లు తగ్గి 3,873.90 డాలర్లకు దిగిరాగా.. సిల్వర్ 2 శాతం తగ్గి 47.82 డాలర్ల వద్ద ట్రేడైంది. అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ ప్రామాణిక వడ్డీ రేట్లను మరింత పెంచవచ్చన్న అంచనాలు ఇందుకు కారణమయ్యాయి.
ఎంసీఎక్స్‌లో భారీ పతనం: మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్(ఎంసీఎక్స్)లో స్పాట్ గోల్డ్ రేటు 1.16ు తగ్గి రూ.1.33 లక్షలకు జారుకోగా.. వెండి రేటు 4.50ు క్షీణించి రూ.1.69 లక్షల స్థాయికి దిగివచ్చింది. ఫెడ్ రేట్ల పెంపు భయాల నేపథ్యంలో ఈ విలువైన లోహాల ధరలు మున్ముందు మరింత తగ్గవచ్చని కమోడిటీ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇవీ చదవండి
జంగిల్ సఫారీలో పర్యాటకులకు షాక్.. దూసుకొచ్చిన పెద్దపులి!