Share News

బంగారం రూ.2,800 డౌన్‌

ABN , Publish Date - Nov 19 , 2026 | 02:45 AM

బంగారం, వెండి ధరలు మరింతగా దిగివచ్చాయి. బుధవారం ఢిల్లీ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ.2,800 తగ్గి...

బంగారం రూ.2,800 డౌన్‌

బంగారం, వెండి ధరలు మరింతగా దిగివచ్చాయి. బుధవారం ఢిల్లీ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ.2,800 తగ్గి రూ.1,35,800కు చేరుకుంది. పసిడి ధర వరుసగా ఏడో రోజూ తగ్గింది. ఇక కిలో వెండి ధర ఏకంగా రూ.5,000 తగ్గి రూ.1,64,500కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో ఈ రెండు విలువైన లోహాల ధరలు తగ్గుతున్న నేపథ్యంలో దేశీయంగానూ వీటి ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌ (31.10 గ్రాములు) బంగారం ధర ఒక దశలో 78.71 డాలర్లు తగ్గి 3,770.54 డాలర్ల వద్ద ట్రేడయింది. అలాగే వెండి ధర 3 శాతానికి పైగా తగ్గి 45.86 డాలర్ల వద్ద కదలాడింది.

ఇవి కూడా చదవండి..

కశ్మీర్‌లో మళ్లీ ఎన్‌కౌంటర్.. ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు..

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

Updated Date - Nov 19 , 2026 | 02:45 AM