Share News

ధరల పెంపునకు ఎఫ్‌ఎంసీజీల విముఖత

ABN , Publish Date - Sep 21 , 2026 | 05:10 AM

వేగంగా అమ్ముడయ్యే వినియోగ వస్తువుల (ఎఫ్‌ఎంసీజీ) కంపెనీలకు కొత్త భయం పట్టుకుంది. ప్రధాన ముడి పదార్ధాలైన చక్కెర, వంట నూనెలతో పాటు..

ధరల పెంపునకు ఎఫ్‌ఎంసీజీల విముఖత

అమ్మకాలకు బ్రేక్‌ పడుతుందనే భయం

న్యూఢిల్లీ: వేగంగా అమ్ముడయ్యే వినియోగ వస్తువుల (ఎఫ్‌ఎంసీజీ) కంపెనీలకు కొత్త భయం పట్టుకుంది. ప్రధాన ముడి పదార్ధాలైన చక్కెర, వంట నూనెలతో పాటు ఇంధన, ప్యాకేజింగ్‌ ఖర్చులు ఇటీవల బాగా పెరిగిపోయాయి. ఇవి చాలవన్నట్టు అంతర్జాతీయ ఉద్రిక్తతలతో కొన్ని ప్రధాన ముడి వస్తువుల సరఫరాకూ తీవ్ర అడ్డంకులు ఏర్పడుతున్నాయి. దీంతో చాలా ఎఫ్‌ఎంసీజీ కంపెనీల లాభాలపై ఒత్తిడి పెరిగింది. అయినా ఈ కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలు పెంచేందుకు ఏ మాత్రం ఇష్టపడడం లేదు. ధరలు పెంచితే పండగల సీజన్‌లో ఎక్కడ అమ్మకాలు పడిపోతాయోనని భయపడుతున్నాయి.

దీపావళి తర్వాతే: నిజానికి ఉత్పత్తి ఖర్చులు పెరగడంతో జూన్‌ త్రైమాసికంలో ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలు 3 నుంచి 5 శాతం వరకు పెంచాయి. దాంతో కంపెనీలపై చాలా వరకు భారం తగ్గింది. ఇప్పుడు మళ్లీ అవే ముడి పదార్ధాల ధరలు మరింత పెరిగాయి. ఈ భారాన్ని ఖర్చుల నియంత్రణ, ఇతర చర్యల ద్వారా తట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. అమ్మకాల పరిమాణం పెంచుకోవడం ద్వారా లాభాలకు గండి పడకుండా చూసుకునేందుకే కంపెనీలు ప్రస్తుతం ప్రాధాన్యత ఇస్తున్నాయి. పండగల సీజన్‌ ముగిసే వరకు ఈ పరిస్థితి తప్పదని ఐటీసీ ఫుడ్స్‌ సీఈఓ హేమంత్‌ మాలిక్‌ చెప్పారు.

ఈ వార్తలు కూడా చదవండి

భారత జీడీపీ 7 శాతం: మూడీస్‌

నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.12.12 లక్షల కోట్లు

Updated Date - Sep 21 , 2026 | 05:10 AM