క్రూడ్ సెంచరీ
ABN , Publish Date - Jul 24 , 2026 | 02:17 AM
బ్రెంట్ క్రూడాయిల్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ (జూలైలో డెలివరీ) ధర ఒక దశలో 6 శాతానికి పైగా ఎగబాకి 100 డాలర్లు దాటింది....
100 డాలర్లకు ముడి చమురు ధర
మే 26 తర్వాత మళ్లీ ఇదే మొదటిసారి
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలే కారణం
ఈనెలలో బ్రెంట్ క్రూడ్ 36ు జంప్
న్యూయార్క్: బ్రెంట్ క్రూడాయిల్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ (జూలైలో డెలివరీ) ధర ఒక దశలో 6 శాతానికి పైగా ఎగబాకి 100 డాలర్లు దాటింది. ఈ మే నెల 26 తర్వాత బ్రెంట్ చమురు 100 డాలర్లకు చేరడం ఇదే మొదటిసారి. యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ రేటు సైతం 5 శాతానికి పైగా పెరుగుదలతో 91.08 డాలర్లకు చేరుకుంది. ఎర్ర సముద్రంలో ట్యాంకర్లపై హౌతీలు పెద్దఎత్తున దాడులకు పాల్పడినట్లు వార్తలు రావడంతోపాటు ఇరాన్‌పై ఇక విరుచుకుపడతామని అమెరికా హెచ్చరించడం ఇందుకు ప్రధాన కారణం. ఈ నెలలో బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టుల రేటు 36 శాతం, వెస్ట్ టెక్సాస్ క్రూడ్ రేటు 30 శాతం ఎగబాకాయి. ఈ రెండింటికీ గడిచిన దశాబ్దకాలంలో ఇది మూడో అతిపెద్ద నెలవారీ పెరుగుదల.
ఈ వార్తలనూ చదవండి:
ఇన్‌స్టా స్టోరీలో 'కాక్రోచ్' పోస్ట్.. వివాదంలో ఆర్ఏఎఫ్ ఆఫీసర్ సోనియా!
ప్రధాని నివాసం ముందు కాంగ్రెస్ నిరసన.. వాంగ్‌చుక్ భార్య విమర్శలు