2029 ఏప్రిల్ నుంచి బీఎస్-7 నిబంధనలు
ABN , Publish Date - Oct 15 , 2026 | 06:21 AM
మోటారు వాహనాల కాలుష్య ఉద్గారాల నియంత్రణ ప్రమాణాల నిబంధనలను మరింత కఠినం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది...
న్యూఢిల్లీ: మోటారు వాహనాల కాలుష్య ఉద్గారాల నియంత్రణ ప్రమాణాల నిబంధనలను మరింత కఠినం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా 2029 ఏప్రిల్ నుంచి కొత్తగా మార్కెట్కు వచ్చే కార్లు, ఎస్యూవీలకు భారత్ స్టేజ్-7 (బీఎస్-7) కాలుష్య నియంత్రణ ప్రమాణాలను అమలు చేయాలని యోచిస్తోంది. ముందుగా ప్రయాణికులు, సరుకుల రవాణా కోసం ఉపయోగించే చిన్న వాహనాలు, పికప్ వ్యాన్లకు ఈ నిబంధనలు అమలు చేస్తారు. 2031 ఏప్రిల్ నుంచి 2035 ఏప్రిల్ మధ్యకాలంలో దశల వారీగా మిగతా మోటారు వాహనాలకూ బీఎస్-7 నిబంధనలు అమలు చేయనున్నట్టు ప్రభుత్వం తెలిపింది.
ఇవి కూడా చదవండి:
తన పని తాను చేశాడు.. ఫలితం వెతుక్కుంటూ వచ్చింది: అశ్విన్
ప్రయాణాన్ని కొత్తగా ప్రారంభిస్తున్నాం.. మళ్లీ ఒక్కటైన క్రికెటర్ పృథ్వీ షా-ఆకృతి
పోలీసుల దాడుల్లో ఓ విద్యార్థిని వినికిడి శక్తి కోల్పోయింది.. దీనికి బాధ్యులెవరు? : రాహుల్ గాంధీ