Banks Refuse to Disclose NPA And Defaulters: ఎన్‌పీఏలు, ఎగవేతదారుల పేర్లు బయటపెట్టలేం
ABN , Publish Date - Jan 12 , 2026 | 05:23 AM
సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) చట్టం కింద రుణ ఎగవేతదారుల పేర్లు, మొండి బకాయిదారుల (ఎన్‌పీఏ) వివరాలు ఇచ్చేందుకు కూడా బ్యాంకులు ఇష్టపడటం లేదు....
సీఐసీ ముందుకు ఆర్‌బీఐ-బ్యాంకుల పంచాయితీ
న్యూఢిల్లీ: సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) చట్టం కింద రుణ ఎగవేతదారుల పేర్లు, మొండి బకాయిదారుల (ఎన్‌పీఏ) వివరాలు ఇచ్చేందుకు కూడా బ్యాంకులు ఇష్టపడటం లేదు. చివరికి తమ తనిఖీల రికార్డులు బయట పెట్టేందుకు, పెనాల్టీల వివరాలు వెల్లడించేందుకూ ససేమిరా అంటున్నాయి. ఆర్‌టీఐ కింద ఈ సమాచారం వెల్లడించాల్సిందేనని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) మొట్టికాయలు వేసినా.. ఇవ్వంగాక ఇవ్వమని మొండికేస్తున్నాయి. ఈ విషయంలో ఆర్‌బీఐ తమను ఒత్తిడి చేయకుండా అడ్డుకోవాలని ఎస్‌బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ), యస్ బ్యాంక్, ఆర్‌బీఎల్ బ్యాంక్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ (సీఐసీ)ని ఆశ్రయించాయి. ఆర్‌బీఐ కోరినట్టు ఆర్‌టీఐ కింద ఈ వివరాలు వెల్లడించడం, తమ వ్యాపార కార్యకలాపాలను దెబ్బతీస్తుందని వితండవాదం మొదలుపెట్టాయి. దీంతో సీఐసీ ఈ కేసును విస్తృత ధర్మాసనానికి నివేదించారు. ధీరజ్ మిశ్రా, వతిరాజ్, గిరీశ్ మిత్తల్, రాధా రామన్ తివారీ అనే వ్యక్తులు ఆర్‌టీఐ చట్టం కింద ఆర్‌బీఐ నుంచి ఈ వివరాలు కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కర్నూలుకు హైకోర్టు బెంచ్ రావడం ఖాయం: మంత్రి భరత్
విశాఖ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తే సహించేది లేదు: సీఎం వార్నింగ్
For More AP News And Telugu News