Share News

United Forum of Bank Unions: 27న బ్యాంక్‌ ఉద్యోగుల సమ్మె

ABN , Publish Date - Jan 05 , 2026 | 05:34 AM

బ్యాంకింగ్‌ ఉద్యోగులు మరోసారి సమ్మెకు సిద్ధమవుతున్నారు. ఐదు రోజుల పని దినాల కోసం ఈ నెల 27న దేశవ్యాప్తంగా సమ్మెకు దిగనున్నారు. 2024 మార్చిలో కుదిరిన వేతన ఒప్పందంలో...

United Forum of Bank Unions: 27న బ్యాంక్‌ ఉద్యోగుల సమ్మె

న్యూఢిల్లీ : బ్యాంకింగ్‌ ఉద్యోగులు మరోసారి సమ్మెకు సిద్ధమవుతున్నారు. ఐదు రోజుల పని దినాల కోసం ఈ నెల 27న దేశవ్యాప్తంగా సమ్మెకు దిగనున్నారు. 2024 మార్చిలో కుదిరిన వేతన ఒప్పందంలో ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ (ఐబీఏ) ఇందుకు ఒప్పుకున్నా.. ఇప్పటికీ అమలు చేయనందున ఈ సమ్మెకు దిగుతున్నట్టు తొమ్మిది ఉద్యోగ సంఘాలకు ప్రాతినిధ్యం వహించే యునైటెడ్‌ ఫోరమ్‌ ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ (యూఎ్‌ఫబీయూ) ప్రకటించింది. ప్రస్తుతం బ్యాంకింగ్‌ ఉద్యోగులకు ఆదివారాలతో పాటు ప్రతి నెలా రెండో, ఆఖరి శనివారాలు సెలవులు. అయితే ఒకటి, మూడో శనివారాలను కూడా ఇందులో కలపాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ఆర్‌బీఐ, ఎల్‌ఐసీ, జీఐసీ వంటి సంస్థలు ఇప్పటికే వారానికి ఐదు రోజుల పని విధానాన్ని అమలు చేస్తున్న విషయాన్ని ఉద్యోగ సంఘాలు గుర్తు చేస్తున్నాయి.

ఈ వార్తలు కూడా చదవండి..

మళ్లీ తెలంగాణ సెంటిమెంట్‌ రెచ్చగొడుతున్న బీఆర్ఎస్ నేతలు: జగ్గారెడ్డి

ఫోన్ ట్యాపింగ్ కేసులో నవీన్ రావును ప్రశ్నిస్తున్న సిట్ అధికారులు

For More TG News And Telugu News

Updated Date - Jan 05 , 2026 | 05:34 AM