Share News

మార్కెట్లోకి అప్రిలియా సరికొత్త స్కూటర్లు

ABN , Publish Date - Oct 20 , 2026 | 02:45 AM

పియాజియో వెహికల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు చెందిన అప్రిలియా ఇండియా.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మార్కెట్లలోకి...

మార్కెట్లోకి అప్రిలియా సరికొత్త స్కూటర్లు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): పియాజియో వెహికల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు చెందిన అప్రిలియా ఇండియా.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మార్కెట్లలోకి సరికొత్త ఎస్‌ఎక్స్‌ఆర్‌ జీటీ శ్రేణి స్కూటర్లను తీసుకువచ్చింది. సోమవారం నాడిక్కడ పియాజియో వెహికల్స్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అజయ్‌ రఘువంశీ ఎస్‌ఎక్స్‌ఆర్‌ జీటీ 175 సీసీ, 125 సీసీ శ్రేణి స్కూటర్లను విడుదల చేశారు. స్కూటర్‌ విభాగంలో 175 సీసీ ఇంజన్‌తో స్కూటర్‌ను తీసుకురావటం ఇదే తొలిసారని ఆయన చెప్పారు. 14 అంగుళాల వీల్స్‌, అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ ఫీచర్లతో ఎస్‌ఎక్స్‌ఆర్‌ జీటీ శ్రేణి స్కూటర్లను రూపొందించినట్లు తెలిపారు. తెలంగాణలో ఈ స్కూటర్ల ధరలు వరుసగా రూ.1,30,374, రూ.1,10,374 (ఎక్స్‌షోరూమ్‌)గా ఉన్నాయి. ప్రస్తుతం ఏపీ, తెలంగాణల్లో కంపెనీ మొత్తం 34 షోరూమ్స్‌ను నిర్వహిస్తోందన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

విజయవాడ ఉత్సవ్ ముగింపు వేడుకలు.. 2 వేల మంది కళాకారులతో దసరా కార్నివాల్

నేహాబోరాకు ఢిల్లీ పోలీసుల నోటీసులు.. హైకోర్టును ఆశ్రయించిన ఏఐఎస్ఏ అధ్యక్షురాలు

For More AP News And Telugu News

Updated Date - Oct 20 , 2026 | 02:45 AM