భారత్‌లో యాపిల్ పే సేవలు!
ABN , Publish Date - Sep 20 , 2026 | 03:49 AM
అమెరికన్ టెక్నాలజీ దిగ్గజం యాపిల్‌కు చెందిన ‘యాపిల్ పే’ డిజిటల్ చెల్లింపు సేవలు ఎట్టకేలకు భారత మార్కెట్లోనూ అందుబాటులోకి రాబోతున్నాయి...
న్యూఢిల్లీ: అమెరికన్ టెక్నాలజీ దిగ్గజం యాపిల్‌కు చెందిన ‘యాపిల్ పే’ డిజిటల్ చెల్లింపు సేవలు ఎట్టకేలకు భారత మార్కెట్లోనూ అందుబాటులోకి రాబోతున్నాయి. దేశీయ ప్రైవేట్ బ్యాంకింగ్ సంస్థ యాక్సిస్ బ్యాంక్ భాగస్వామ్యంలో వచ్చే నెలలో యాపిల్ పే సేవలు మన దేశంలో ప్రారంభం కాబోతున్నట్లు తెలిసింది. తొలుత యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు హోల్డర్లకు ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. కాగా హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌తోనూ ఇందుకు సంబంధించి యాపిల్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. యాపిల్ పే సేవలు తొలుత అమెరికాలో 2014 అక్టోబరులో ప్రారంభమయ్యాయి. ఇప్పటికే 89 మార్కెట్లకు విస్తరించింది. 12 ఏళ్ల తర్వాత భారత్‌లో అందుబాటులోకి రానున్నాయి. యాపిల్ ఐఫోన్, వాచ్, ఐప్యాడ్, మ్యాక్ బుక్‌తో మీ డెబిట్ లేదా క్రెడిట్ కార్డును అనుసంధానించుకోవడం ద్వారా డిజిటల్ చెల్లింపులు జరిపేందుకు యాపిల్ పే అనుమతిస్తుంది. యాపిల్ డివైజ్‌లో మీ కార్డు వివరాలను డిజిటలీకరించుకోవడం (టోకనైజేషన్) ద్వారా కొనుగోలు సమయంలో ప్రత్యేకంగా పేమెంట్ యాప్‌ను తెరవాల్సిన అవసరం లేకుండా ట్యాప్- అండ్- పే చెల్లింపులు చేపట్టవచ్చు.
ఇవి కూడా చదవండి...
రహస్య వివాహం.. కొద్దిరోజులకే భార్యకు షాక్
బీజేపీ న్యాయ పోరాటం వల్లే దానంపై అనర్హత వేటు: కిషన్ రెడ్డి
Read Latest Telangana News And Telugu News