Share News

కష్టమైన పనులు చక్కబెట్టే అమెజాన్‌ ప్రోటియస్‌ రోబో

ABN , Publish Date - Jun 05 , 2026 | 03:57 AM

గ్లోబల్‌ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌.. ఐరోపాలోని తన ఫుల్‌ఫిల్‌మెంట్‌ కేంద్రాల్లో తదుపరి తరం ‘ప్రోటియస్‌’ రోబోను గురువారం ప్రవేశపెట్టింది. ఇది శారీరక శ్రమతో...

కష్టమైన పనులు చక్కబెట్టే అమెజాన్‌ ప్రోటియస్‌ రోబో

లండన్‌: గ్లోబల్‌ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌.. ఐరోపాలోని తన ఫుల్‌ఫిల్‌మెంట్‌ కేంద్రాల్లో తదుపరి తరం ‘ప్రోటియస్‌’ రోబోను గురువారం ప్రవేశపెట్టింది. ఇది శారీరక శ్రమతో కూడిన పనులను చేయడం ద్వారా ఉద్యోగులకు ఎంతో సహాయకారిగా ఉంటుంది. ఇది సహజ భాష ద్వారా ఇచ్చే ఆదేశాలను అర్థం చేసుకోగలదు. ఎలాంటి సాంకేతిక కమాండ్లు లేదా ప్రోగ్రామింగ్‌ ఇంటర్‌ఫేస్‌ అవసరం లేకుండా ఒక సహోద్యోగితో మాట్లాడినట్టే సాధారణ, సంభాషణాత్మక భాషలోనే ఉద్యోగులు దీనికి పనులను చెప్పవచ్చు. ఏ పని చేయాలో సాధారణ భాషలో ఉద్యోగి చెబితే చాలు మిగిలిన పనిని ఆ రోబో చూసుకుంటుందని కంపెనీ పేర్కొంది. భారీ కార్టులను తరలించడం, ఎక్కువ దూరం వెళ్లడం వంటి శారీరక శ్రమతో కూడుకున్న పనులను చేపట్టేలా ప్రోటియ్‌సను రూపొందించినట్టు తెలిపింది. యూర్‌పలోని తన ఫుల్‌ఫిల్‌మెంట్‌ కార్యకలాపాల విస్తరణ, ఆధునికీకరణకు వచ్చే కొన్నేళ్లలో 10 బిలియన్‌ యూరోలకు పైగా పెట్టుబడి పెట్టాలన్న అమెజాన్‌ ప్రణాళికలో ఈ కొత్త టెక్నాలజీలు భాగంగా ఉన్నాయి.

ఈ వార్తలు కూడా చదవండి..

రేపటి నుంచి భూముల ధరల పెంపు: మంత్రి పొంగులేటి

ప్రతి ఒక్కరూ రేపు సైకిల్‌ వినియోగించాలి.. ప్రజలకు సీఎం చంద్రబాబు పిలుపు

Read Latest National News And Telugu News

Updated Date - Jun 05 , 2026 | 03:57 AM