అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌తో రూ.2,800 కోట్లు ఆదా
ABN , Publish Date - Nov 08 , 2026 | 04:18 AM
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026తో దేశవ్యాప్తంగా వినియోగదారులు రికార్డు స్థాయిలో రూ.2,800 కోట్ల మొత్తాన్ని ఆదా...
హైదరాబాద్: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026తో దేశవ్యాప్తంగా వినియోగదారులు రికార్డు స్థాయిలో రూ.2,800 కోట్ల మొత్తాన్ని ఆదా చేసుకోగలిగారని అమెజాన్ వెల్లడించింది. ఈ నెల 11 వరకు ఈ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ కొనసాగనుందని తెలిపింది. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది అమ్మకాలు దాదాపు 50 శాతం పెరగగా 393 కోట్ల మంది వినియోగదారులు ఫెస్టివల్ సైట్‌ను సందర్శించారని తెలిపింది. మరోవైపు ప్రైమ్ మెంబర్స్.. ప్రైమ్ ఓన్లీ ఆఫర్స్‌తో 10 రెట్లకు పైగా ఆదా చేయగలిగారని తెలిపింది. దేశవ్యాప్తంగా 120కి పైగా నగరాల్లో నిమిషాల వ్యవధిలోనే రెండు ఉత్పత్తులను అమెజాన్ డెలివరీ చేసిందని వెల్లడించింది. అంతేకాకుండా మూడు ఆర్డర్లలో ఒక డెలివరీని అదే రోజున చేసిందని పేర్కొంది. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో చిన్న, మధ్య తరహా వ్యాపార విక్రేతల సంఖ్య పది రెట్లు పెరగగా వార్షిక ప్రాతిపదికన అమ్మకాలు 30 శాతం పెరిగాయని తెలిపింది. కాగా ఈ నెల 11 వరకు అందుబాటులో ఉండే ఈ ఫెస్టివల్‌లో వినియోగదారులకు విస్తృత స్థాయిలో ఉత్పత్తులను అందుబాటులో ఉంచటంతో పాటు క్యాష్‌బ్యాక్ ఆఫర్లను అందిస్తున్నట్లు అమెజాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ సౌరభ్ శ్రీవాస్తవ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గ్లాండ్ ఫార్మా లాభం రూ.291 కోట్లు
For More Business News And Telugu News