Share News

అమెజాన్‌లో మరోసారి లేఆఫ్స్.. ఈ సారి వాళ్లను టార్గెట్ చేసిన కంపెనీ..

ABN , Publish Date - Mar 05 , 2026 | 01:30 PM

ప్రముఖ ఈకామర్స్ సంస్థ అమెజాన్ మరోసారి ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. రాయిటర్స్ కథనం ప్రకారం.. మంగళవారం రోబోటిక్స్ యూనిట్‌లోని ఉద్యోగులను తీసేసింది.

అమెజాన్‌లో మరోసారి లేఆఫ్స్.. ఈ సారి వాళ్లను టార్గెట్ చేసిన కంపెనీ..
Amazon layoffs 2026

ఇంటర్‌నెట్ డెస్క్: ప్రముఖ ఈకామర్స్ సంస్థ అమెజాన్ మరోసారి ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. రాయిటర్స్ కథనం ప్రకారం.. మంగళవారం రోబోటిక్స్ యూనిట్‌లోని ఉద్యోగులను తీసేసింది. ఈ లేఆఫ్స్ కారణంగా రోబోటిక్ యూనిట్‌లోని 100 వైట్ కాలర్ జాబ్స్‌‌పై ప్రభావం పడింది. రోబోట్స్ డిజైనింగ్, ఆటోమేషన్ కోసం ఉపయోగిస్తున్న రవాణా వ్యవస్థలతో పాటు వేర్ హౌస్‌లో పని చేసే వారి ఉద్యోగాలు పోయాయి. కాగా, అమెజాన్ సంస్థ గత ఏడాది 30 వేల మందిని తొలగించబోతున్నట్లు ఓ ప్రకటన విడుదల చేసింది. ఆ ఏడాది అక్టోబర్ నెలలో 14 వేల మంది ఉద్యోగులను తొలగించింది.


2026 జనవరి నెలలో ఏకంగా 16 వేల మంది ఉద్యోగులను బయటకు పంపేసింది. భవిష్యత్తులో కూడా లేఆఫ్స్ కొనసాగుతాయని ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే మరోసారి 100 మందిని ఉద్యోగంలోంచి తీసేసింది. లేఆఫ్స్‌పై కంపెనీ సీఈఓ ఆండీ జెస్సీ గతంలో మాట్లాడుతూ.. ‘ఆర్థికపరమైన విషయాల వల్ల ఉద్యోగాలు తీసేయడం లేదు. అలాగని ఏఐ కారణంగానూ తొలగించడం లేదు. కంపెనీ సంప్రదాయంలో భాగంగానే లేఆఫ్స్ జరుగుతున్నాయి. ఏటా కొత్త ఉద్యోగులను తీసుకుంటూనే ఉంటాం. అలాంటప్పుడు ఉద్యోగుల సంఖ్య కూడా పెరుగుతూ పోతుంది. అందుకే లేఆఫ్స్ తప్పవు’ అని అన్నారు.


ఇవి కూడా చదవండి

రహదారుల పక్కన ఉండే వృక్షాల కోసం ప్రత్యేక పాలసీ: పవన్ కల్యాణ్

టీచర్‌పై విద్యార్థి దాడి.. వీడియో వైరల్..

Updated Date - Mar 05 , 2026 | 01:35 PM