Share News

మస్క్‌ కంపెనీ కంటే వరుసలో మేమే ముందున్నాం..

ABN , Publish Date - Oct 15 , 2026 | 06:25 AM

భారత్‌లో శాటిలైట్‌ ఇంటర్నెట్‌ (శాట్‌కామ్‌) సేవలను ప్రారంభించేందుకు అనుమతి కోసం ఎలాన్‌ మస్క్‌ కంపెనీ స్టార్‌లింక్‌ కంటే మా సంస్థే వరుస(క్యూ)లో ముందు ఉందని...

మస్క్‌ కంపెనీ కంటే వరుసలో మేమే ముందున్నాం..

  • శాట్‌కామ్‌ సేవల ప్రారంభంపై ఎయిర్‌టెల్‌ చైర్మన్‌ సునీల్‌ మిట్టల్‌

న్యూఢిల్లీ: భారత్‌లో శాటిలైట్‌ ఇంటర్నెట్‌ (శాట్‌కామ్‌) సేవలను ప్రారంభించేందుకు అనుమతి కోసం ఎలాన్‌ మస్క్‌ కంపెనీ స్టార్‌లింక్‌ కంటే మా సంస్థే వరుస(క్యూ)లో ముందు ఉందని భారతీ ఎయిర్‌టెల్‌ చైర్మన్‌ సునీల్‌ మిట్టల్‌ అన్నారు. ‘‘మస్క్‌ కంటే క్యూలో ముందు నేనే ఉన్నా. మా శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవల కంపెనీ యూటెల్‌శాట్‌ వన్‌వెబ్‌ ఐదేళ్ల క్రితమే లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకుంది. మాకు ఇప్పటికీ అనుమతులు రాలేదు. మస్క్‌ కంపెనీ కంటే కొన్ని రోజుల ముందే అనుమతి వస్తే సంతోషిస్తాం’’ అని బ్లూంబర్గ్‌ న్యూ ఎకానమీ ఫోరమ్‌ 2026లో బుధవారం పాల్గొన్న సందర్భంగా మిట్టల్‌ అన్నారు. కాగా, స్టార్‌లింక్‌ భారత్‌లో సేవలు ప్రారంభించేందుకు అనుమతులను రాకుండా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ అడ్డుకుంటున్నారని ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ ఆరోపించారు. గత వారం తన సామాజిక మాధ్యమం ఎక్స్‌లో వరుస పోస్ట్‌లు పెట్టారు. భారత ప్రధాని అంబానీ అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:

తన పని తాను చేశాడు.. ఫలితం వెతుక్కుంటూ వచ్చింది: అశ్విన్

ప్రయాణాన్ని కొత్తగా ప్రారంభిస్తున్నాం.. మళ్లీ ఒక్కటైన క్రికెటర్ పృథ్వీ షా-ఆకృతి

పోలీసుల దాడుల్లో ఓ విద్యార్థిని వినికిడి శక్తి కోల్పోయింది.. దీనికి బాధ్యులెవరు? : రాహుల్ గాంధీ

Updated Date - Oct 15 , 2026 | 06:25 AM