Share News

జీవితాన్ని మార్చేసిన పేరు.. ఏకంగా రూ. 600 కోట్లు..

ABN , Publish Date - Feb 13 , 2026 | 06:58 AM

పేరు కారణంగా మలేషియాకు చెందిన ఓ వ్యక్తి జీవితం పూర్తిగా మారిపోయింది. ఒక్కసారిగా అతడు అపర కుబేరుడు అయిపోయాడు. అతడి ఖాతాలోకి ఏకంగా 600 కోట్ల రూపాయలు వచ్చి పడ్డాయి.

జీవితాన్ని మార్చేసిన పేరు.. ఏకంగా రూ. 600 కోట్లు..
AI.com domain sale story

ఇంటర్‌నెట్ డెస్క్: పేరు ఓ వ్యక్తి జీవితాన్ని మార్చేసింది. అతడ్ని అపర కుబేరుడిని చేసేసింది. ఏకంగా 600 కోట్ల రూపాయలు అతడి ఖాతాలోకి వచ్చి పడ్డాయి. ఇంతకీ సంగతేంటంటే.. మలేషియాకు చెందిన టెక్ ఎంటర్‌ప్రెన్యూర్ అర్స్యన్ ఇస్మాయిల్ 1993లో ఏఐ.కామ్ అనే డొమై‌న్ కొన్నాడు. ఇక్కడ ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు.. అతడి పేరు. భవిష్యత్తులో ఏఐ వస్తుందని, తన జీవితాన్ని మార్చేస్తుందని అతడు అస్సలు ఊహించలేదు.


ఏఐ.కామ్ కొనే సమయానికి ఇస్మాయిల్ వయసు 10 సంవత్సరాలు మాత్రమే. అతడు టెక్నాలజీ మీద ఉన్న ఆసక్తితో తన తల్లి క్రెడిట్ కార్డు నుంచి 100 డాలర్లు పెట్టి డొమైన్ కొన్నాడు. ఇస్మాయిల్ తల్లికి డొమైన్ అంటే ఏంటో తెలీదు. తన క్రెడిట్ కార్డునుంచి 100 డాలర్లు డెబిట్ కావటంతో ఆమె చాలా బాధపడింది. అయితే, ఆ 100 డాలర్లే కొడుకు జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయని ఆమె అనుకోలేదు.


ఏఐ జీవితాన్ని మార్చేసింది..

ప్రస్తుతం అన్ని రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఏఐ బిలియన్ డాలర్ల మార్కెట్‌గా మారిపోయింది. ఇలాంటి సమయంలో ఇస్మాయిల్ కొనుగోలు చేసిన ఏఐ.కామ్ డొమైన్‌కు మంచి డిమాండ్ ఏర్పడింది. క్రిప్టో.కామ్ సీఈఓ క్రిస్ మార్స్జాలెక్ ఇస్మాయిల్ నుంచి ఏఐ.కామ్‌ను 70 మిలియన్ డాలర్లు పెట్టి కొన్నాడు. మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే.. 634 కోట్ల రూపాయలు. ఈ మొత్తం లావాదేవీలు క్రిప్టోకరెన్సీ ద్వారా జరిగాయి.


ఇవి కూడా చదవండి

ఆ ఏరియాల్లో.. 10గంటల నుంచి కరెంట్ కట్

బంగారం, వెండి ధరల్లో స్వల్ప మార్పులు.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Feb 13 , 2026 | 08:26 AM