Share News

జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌లో వాటా తగ్గించుకున్న ఏడీపీ

ABN , Publish Date - Apr 25 , 2026 | 02:50 AM

హైదరాబాద్‌, ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయాల నిర్వహణ సంస్థ జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ లిమిటెడ్‌ (జీఏఎల్‌)లో ఫ్రాన్స్‌కు చెందిన...

జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌లో వాటా తగ్గించుకున్న ఏడీపీ

7.3% ఈక్విటీ రూ.10,100 కోట్లకు విక్రయం

న్యూఢిల్లీ: హైదరాబాద్‌, ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయాల నిర్వహణ సంస్థ జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ లిమిటెడ్‌ (జీఏఎల్‌)లో ఫ్రాన్స్‌కు చెందిన గ్రూపే ఏడీపీ వాటా తగ్గనుంది. జీఏఎల్‌లో తనకు చెందిన 7.3 శాతం ఈక్విటీ వాటాను జీఎంఆర్‌ ప్రమోటర్‌ గ్రూప్‌నకు రూ.10,100 కోట్లకు విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు గ్రూపే ఏడీపీ శుక్రవారం వెల్లడించింది. ఈ డీల్‌ పూర్తయ్యాక జీఏఎల్‌లో గ్రూపే ఏడీపీ వాటా 32.3 శాతం నుంచి 25 శాతానికి తగ్గనుంది. ప్రస్తుతం 34.9 శాతంగా ఉన్న జీఎంఆర్‌ ప్రమోటర్‌ గ్రూప్‌ వాటా 42.2 శాతానికి పెరగనుంది. పబ్లిక్‌ షేర్‌హోల్డర్ల వాటా మాత్రం 32.8 శాతంగా కొనసాగనుంది. 2020లో గ్రూపే ఏడీపీ జీఏఎల్‌లో 49 శాతం వాటాను దాదాపు 130 కోట్ల యూరోలకు కొనుగోలు చేసింది. అప్పట్లో జీఏఎల్‌ జీఎంఆర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ (జీఐఎల్‌) అనుబంధ సంస్థగా ఉండేది. 2024 జూలైలో జీఐఎల్‌ వ్యాపార పునర్‌ వ్యవస్థీకరణలో భాగంగా జీఏఎల్‌ను విభజించి ప్రత్యేక సంస్థగా మార్కెట్లో నమోదు చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి...

ఆ వీడియోలతో బ్లాక్ మెయిల్.. హనీట్రాప్ ముఠా సంచలనం

శబరిమల కేసు విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

బాలికల కాలేజీలో కోఎడ్యుకేషన్ ఏర్పాటుపై హైకోర్టు అసంతృప్తి

Read Latest AP News And Telangana News And International News

Updated Date - Apr 25 , 2026 | 02:50 AM