మరోసారి కేంద్ర ప్రభుత్వ ప్రశంసలు.. నిబద్ధతను చాటుకున్న ఏబీఎన్-ఆంధ్రజ్యోతి
ABN , Publish Date - Jul 11 , 2026 | 04:19 PM
తెలుగు మీడియా రంగంలో తనదైన ముద్ర వేసుకున్న ఏబీఎన్-ఆంధ్రజ్యోతి మరోసారి తన నిబద్ధతను చాటుకుంది. కేవలం వార్తలు, సామాజిక బాధ్యతల విషయంలోనే కాదు.. పన్నుల చెల్లింపులోనూ పారదర్శకతకు మారుపేరుగా నిలుస్తూ వస్తోంది. దీనికి నిదర్శనమే కేంద్ర ఆర్థిక శాఖ నుంచి వరుసగా ప్రశంసలు అందుకోవడం.
తెలుగు మీడియా రంగంలో తనదైన ముద్ర వేసుకున్న ఏబీఎన్-ఆంధ్రజ్యోతి మరోసారి తన నిబద్ధతను చాటుకుంది. కేవలం వార్తలు, సామాజిక బాధ్యతల విషయంలోనే కాదు.. పన్నుల చెల్లింపులోనూ పారదర్శకతకు మారుపేరుగా నిలుస్తూ వస్తోంది. దీనికి నిదర్శనమే కేంద్ర ఆర్థిక శాఖ నుంచి వరుసగా ప్రశంసలు అందుకోవడం. చట్టాలను గౌరవిస్తూ, సకాలంలో పన్నులు చెల్లిస్తూ తన బాధ్యతను నిజాయతీగా నిర్వర్తిస్తోంది ఏబీఎన్-ఆంధ్రజ్యోతి.
కేవలం నీతి వాక్యాలు చెప్పడమే కాదు.. వాటిని ఆచరణలో చూపిస్తూ ప్రతి ఆర్థిక సంవత్సరం సకాలంలో, సక్రమంగా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసి, జీఎస్టీ చెల్లించి కేంద్ర ఆర్థిక శాఖ నుంచి అభినందనలు అందుకుంది. ఇప్పటికే పలుమార్లు కేంద్ర ప్రభుత్వ ప్రశంసలు అందుకున్న ఏబీఎన్-ఆంధ్రజ్యోతి.. ఈ సంవత్సరం కూడా జీఎస్టీ చెల్లింపుల్లో పారదర్శకతను కొనసాగించినందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి మరోసారి ప్రశంసా పత్రాన్ని అందుకుంది.

జీఎస్టీ రిజిస్ట్రేషన్ నంబర్ 36AAHCA3752H1ZP కలిగిన ‘ఆమోద బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్’ను అభినందిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ ప్రశంసా పత్రాలను ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ యాజమాన్యానికి పంపింది. 2025-26 సంవత్సరానికి జీఎస్టీ సక్రమంగా చెల్లించినందుకు ఆర్థిక శాఖ ప్రశంసాపత్రాన్ని పంపించింది. సక్రమంగా ఆదాయపు పన్ను చెల్లిస్తూ నవ భారత నిర్మాణంలో తమ వంతు పాత్ర పోషిస్తున్న ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ని సీబీఐసీ చైర్మన్ వివేక్ చతుర్వేది (CBIC Chairman) అభినందించారు. ఈ ప్రశంసా పత్రాలు బాధ్యత కలిగిన మీడియా సంస్థ అయిన ‘ఏబీఎన్ ఆంధ్రజ్యోతి’ నిజాయతీకి నిదర్శనం. ఈ అభినందన ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ నిబద్ధతకు తార్కాణం.
ఏటా పారదర్శకంగా..
2009లో ఏబీఎన్ స్థాపించినప్పటి నుంచి ఇప్పటివరకూ ట్యాక్స్ చెల్లింపుల్లో పారదర్శకంగా నిలిచిన సంస్థ మాది అని నిస్సందేహంగా, నిఖార్సైన సొమ్ముతో నడుస్తున్న మీడియా సంస్థగా గర్వంగా చెబుతున్నాం. ప్రజల హక్కు అయిన సమాచారాన్ని.. వక్రీకరించకుండా, వాస్తవ రూపంలోనే వార్తలుగా అందించే బృహత్తర బాధ్యతను తొలి నుంచీ ఆచరిస్తూ అమలు చేస్తోంది ఏబీఎన్ ఆంధ్రజ్యోతి. ధైర్యమే పెట్టుబడిగా, ఆత్మసంతృప్తే రాబడిగా.. ముందుకు దూసుకెళ్తోంది. ఆ క్రమంలోనే జనంలో 'డేర్ డెవిల్ ఇమేజ్'ను సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకులు ఏబీఎన్ పేరెత్తగానే దమ్మున్న ఛానెల్‌గా, దుమ్మురేపే ఛానెల్‌గా గర్వంగా చెప్పుకునే స్థాయికి చేరుకుంది.




విశ్వసనీయతతో ముందుకు..
పారదర్శకత, నిబద్ధత, నిజాయతీకి మారుపేరుగా నిలిచిన ఏబీఎన్-ఆంధ్రజ్యోతిపై కొందరు చేస్తున్న విమర్శలను ప్రజలే తిప్పికొడుతున్నారు. ఎవరు ఎలాంటి దుష్ప్రచారం చేసినా.. నిజాయతీగా పని చేసే సంస్థకు ప్రజల ఆదరణే అతిపెద్ద బలం. ఆ బలం ఏబీఎన్-ఆంధ్రజ్యోతికి ఓ వరం.
ప్రతి సంవత్సరం సకాలంలో పన్నులు చెల్లిస్తూ, కేంద్ర ప్రభుత్వ ప్రశంసలు అందుకుంటూ విశ్వసనీయ మీడియా సంస్థగా తన ప్రత్యేకతను మరోసారి నిరూపించుకుంది. భవిష్యత్తులోనూ ఇదే పారదర్శకత, ఇదే నిబద్ధత, ఇదే విశ్వసనీయతతో తెలుగు ప్రజలకు సేవలందిస్తామని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి స్పష్టం చేస్తోంది.