Astrology Tips For Women: స్త్రీలు రాత్రిపూట ఈ పనులు చేయకూడదట.. ఎందుకంటే?
ABN , Publish Date - Jan 03 , 2026 | 07:06 PM
శాస్త్రాల ప్రకారం స్త్రీలు రాత్రి పడుకునే ముందు కొన్ని పనులు చేయకూడదనే నమ్మకం ఉంది. అయితే, స్త్రీలు రాత్రిపూట ఏ పనులు చేయకూడదు? ఎందుకు చేయకూడదు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: మన రోజువారీ అలవాట్లు మన జీవితంపై ప్రభావం చూపుతాయని శాస్త్రాలు చెబుతుంటాయి. ఉదయం చేసే పనుల నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతి పనికీ ఒక సమయం, ఒక నియమం ఉంటుందని అంటారు. ముఖ్యంగా స్త్రీలు రాత్రి నిద్రకు ముందు కొన్ని పనులు చేయకూడదని శాస్త్రాల్లో చెప్పబడింది. అయితే, రాత్రి పడుకునే ముందు స్త్రీలు ఏ పనులకు దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం..
జుట్టు విప్పి పడుకోవడం
శాస్త్రాల ప్రకారం, స్త్రీలు రాత్రిపూట జుట్టును విప్పి నిద్రపోవద్దని చెబుతారు. అలా చేయడం వల్ల ప్రతికూల శక్తి ఆకర్షిస్తుందని, ఇంట్లో అశాంతి ఏర్పడుతుందని అంటారు. అలాగే ఇది లక్ష్మీదేవి అసంతృప్తికి కారణమవుతుందని పెద్దలు అంటారు.
పెర్ఫ్యూమ్ వాడటం
పెర్ఫ్యూమ్ వాసన బాగానే ఉన్నా, రాత్రి పడుకునే ముందు లేదా రాత్రివేళ దాన్ని వాడకూడదని శాస్త్రాలు సూచిస్తున్నాయి. ఇలా చేయడం వల్ల ప్రతికూల శక్తులు ఆకర్షితమవుతాయని అంటారు.
రాత్రి జుట్టు దువ్వుకోవడం
చాలామందికి రాత్రి జుట్టు దువ్వుకునే అలవాటు ఉంటుంది. కానీ సూర్యాస్తమయం తర్వాత జుట్టు దువ్వుకోవడం మంచిది కాదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇలా చేస్తే లక్ష్మీదేవి కృప తగ్గి, ఇంట్లో ఆర్థిక సమస్యలు రావచ్చని నమ్మకం.
గొడవలు
రాత్రిపూట వాదనలు, గొడవలు చేయడం వల్ల మనసు అశాంతిగా మారుతుంది. నిద్ర కూడా సరిగ్గా పట్టదు. దీని వల్ల ఇంట్లో వాతావరణం ప్రతికూలంగా మారుతుందని పెద్దలు చెబుతారు. అందుకే రాత్రివేళ శాంతిగా ఉండటం మంచిదని సూచిస్తున్నారు. ఇవి శాస్త్రాలు, సంప్రదాయాల ఆధారంగా చెప్పబడిన నమ్మకాలు. జీవనశైలిలో శాంతి, సానుకూలత కోసం పాటిస్తే మంచిదని పెద్దలు అంటారు.
(Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా మీకు అందించడం జరుగుతుంది. కేవలం మీ అవగాహన కోసమే.. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధృవీకరించలేదు )
ఈ సమస్యలు ఉన్నవారు బాదం తినకపోవడం మంచిది.!
గుడ్డు చెడిపోయిందో లేదో ఎలా తెలుసుకోవాలి?