జస్ట్ మిస్!
ABN , Publish Date - Nov 08 , 2026 | 04:16 AM
నంద్యాల జిల్లాలో జడ్పీ చైర్మన్ రేసులో ఉన్న తాతిరెడ్డి తులసిరెడ్డి జడ్పీటీసీగా ఓటమి పాలయ్యారు. శ్రీశైలం నియోజకవర్గం బండి ఆత్మకూరు జడ్పీటీసీగా పోటీ చేసిన ఈయన..
జడ్పీ చైర్మన్ రేసులో ఉండి జడ్పీటీసీగా ఓటమి
నంద్యాలలో తులసిరెడ్డి.. విజయనగరంలో సంధ్య ఓటమి
అమరావతి, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): నంద్యాల జిల్లాలో జడ్పీ చైర్మన్ రేసులో ఉన్న తాతిరెడ్డి తులసిరెడ్డి జడ్పీటీసీగా ఓటమి పాలయ్యారు. శ్రీశైలం నియోజకవర్గం బండి ఆత్మకూరు జడ్పీటీసీగా పోటీ చేసిన ఈయన.. వైసీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. దీంతో ఆళ్లగడ్డ జడ్పీటీసీగా గెలుపొందిన పోరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, వెలుగోడు జడ్పీటీసీగా గెలుపొందిన గుండం వెంకటరమణారెడ్డి ప్రస్తుతం రేసులో మిగిలారు. విజయనగరం జిల్లాలో జడ్పీ చైర్‌పర్సన్‌గా మజ్జి సిరిసహస్రతోపాటు సీనియర్ ఎమ్మెల్యే కిమిడి కళావెంకట్రావు కోడలు సంధ్య పేరు కూడా పరిశీలనలో ఉంది.
అయితే గరివిడి జడ్పీటీసీ నుంచి బరిలోకి దిగిన ఈమె.. వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ కోడలు పూజిత చేతిలో ఓటమి పాలయ్యారు. కొయ్యూరు జడ్పీటీసీగా పోటీచేసిన వైసీపీ మాజీ ఎంపీ జి.మాధవి, ముంచంగిపుట్టు నుంచి బరిలోకి దిగిన అదే పార్టీ నాయకురాలు జై సుభద్ర.. అల్లూరి సీతారామరాజు జిల్లా జడ్పీ చైర్మన్ రేసులో ఉన్నారు. కానీ వారిద్దరూ ఓటమిపాలయ్యారు. కూటమి తరఫున ఇదే పదవికి రేసులో ఉన్న జనసేన నేత ఆర్.శ్రావణ్‌కుమార్ కూడా ముంచంగిపుట్టులో ఓడిపోయారు. ఇక్కడ సీపీఎం గెలిచింది.
ఈ వార్తలనూ చదవండి:
ఫలించిన మంత్రి కొండపల్లి వ్యూహం.. బొత్స కూతురిపై సామాన్య మహిళ గెలుపు..