Share News

చంద్రబాబు... మీ పాలన హేయం: జగన్‌

ABN , Publish Date - Nov 08 , 2026 | 05:02 AM

‘మీ నిర్బంధాలు దుర్మార్గం.. మీ పాలన హేయం’ అంటూ సీఎం చంద్రబాబుపై వైసీపీ అధ్యక్షుడు జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

చంద్రబాబు... మీ పాలన హేయం: జగన్‌

అమరావతి, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): ‘మీ నిర్బంధాలు దుర్మార్గం.. మీ పాలన హేయం’ అంటూ సీఎం చంద్రబాబుపై వైసీపీ అధ్యక్షుడు జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగార్జున వర్సిటీకి చేరాల్సిన జడ్పీటీసీ, ఎంపీటీసీ బ్యాలెట్‌ బాక్సులను మధ్యలో నల్లపాడు వద్ద ఎందుకు దింపారంటూ ప్రశ్నించారు. ఈమేరకు శనివారం జగన్‌ ఎక్స్‌లో స్పందించారు. ‘బ్యాలెట్‌ బాక్సులు నడిరోడ్డు మీద కనిపిస్తే.. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని అక్రమంగా అరెస్టు చేస్తారా? వైసీపీ అభ్యర్థులు విజయం సాధిస్తే ఫలితాన్ని ప్రకటించరా? పోలింగ్‌ ముగిశాక ఫలితాలనూ రిగ్గింగ్‌ చేస్తారా?’ అని జగన్‌ మండిపడ్డారు.

ఈ వార్తలనూ చదవండి:

కూటమి.. సునామీ

ఫలించిన మంత్రి కొండపల్లి వ్యూహం.. బొత్స కూతురిపై సామాన్య మహిళ గెలుపు..

Updated Date - Nov 08 , 2026 | 05:02 AM